గూగుల్ మరో రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో (Google Pixel 6 Pro) పేరుతో ఇవి అక్టోబర్‌లో విడుదల కానున్నట్లు తైవాన్‌కు చెందిన ఎన్సీసీ డేటాబేస్ తెలిపింది. పిక్సెల్ 6 ప్రో 33వాట్స్ స్పీడ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తోందని పేర్కొంది. దీనిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా తీసుకొస్తుందని తెలిపింది.
పిక్సెల్ 6 ప్రో ఫీచర్లు..
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
- 6.71 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
- 1,440x3,120 రిజల్యూషన్‌తో డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్
- డిజిటల్ కార్ కీ ఆప్షన్
- 12 జీబీ ర్యామ్/512 జీబీ స్టోరేజి,
- ట్రిపుల్ రేర్ కెమెరా, 50 ఎంపీ శాంసంగ్ జీఎన్1 ప్రైమరీ సెన్సార్(12ఎంపీ, 48ఎపీ).
- ఆండ్రాయిడ్ 12, ఆక్టా కోర్ సీపీయూ.
- సుమారు 80 వేల వరకు ఉండొచ్చని అంచనా.
- వైఫై 6ఈ సదుపాయం
- బ్లూటూత్
- జీపీఎస్
వన్‌ప్లస్ 9టీ సిరీస్ విడుదల వాయిదా..