Google Pay Charges For Mobile Recharge :వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది ఆన్లైన్ చెల్లింపుల సంస్థగూగుల్ పే. యూపీఐ ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు కొత్తగా రూ. 3 కన్వీనియన్స్ ఛార్జీలను విధిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. కానీ, రూ.3 ఛార్జీ విధించిన విషయాన్ని ఓ నెటిజన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఫలితంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
రూ. 3 కన్వీనెన్స్ ఫీ
Google Pay Convenience Fee :ఇప్పటికే ఫోన్ పే, పేటీఎం లాంటి సంస్థలు యూపీఐ ద్వారా చేసే మొబైల్ రీఛార్జ్‌లకు రుసుమును వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో గూగుల్ పే కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. ముకుల్ శర్మ అనే వ్యక్తి ట్విట్టర్లో సంబంధిత పోస్ట్‌ను షేర్ చేశారు. ఆయన గూగుల్ పే యాప్ ద్వారా రూ. 749 రూపాయలు జియో ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకున్నారు. దీనిపై రూ.3 కన్వీనియన్స్ ఫీజు విధించినట్లుగా మెసేజ్ వచ్చింది.
'రూ.100 లోపు రీఛార్జ్‌లకు వర్తించదు'
అయితే రూ. 100లోపు గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసేవారికి ఈ నిబంధన వర్తించదని ముకుల్ శర్మ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు. ఆ పోస్ట్ ప్రకారం రూ. 100 నుంచి రూ.200 వరకు కన్వీనియన్స్ ఛార్జ్ రూ.2లు, రూ. 200 నుంచి రూ.300 వరకు చేసే రీఛార్జ్‌లపై రూ.3 లు ఛార్జ్ చేస్తుంది. రూ.300పైన చేసిన రీఛార్జులకు కూడా రూ. 3 ఛార్జీ ఉందని ముకుల్ శర్మ తెలిపారు.