ETV Bharat / science-and-technology
గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్ గురించి ఇవి తెలుసుకోండి - google password manager app
గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్‌తో అన్ని ఖాతాల పాస్‌వర్డ్, యూజర్‌నేమ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఒకచోట భద్రపరచుకోవచ్చు. మరి గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ హోమ్ స్క్రీన్‌కు ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
బ్యాంకు లావాదేవీలైనా, నగదు చెల్లింపులైనా, కొనుగోళ్లయినా అన్నీ ఉన్నచోటు నుంచే ఆన్‌లైన్‌లో కానిచ్చేస్తున్నాం. వీటి లాగిన్ సమాచారం ఇతరులు యాక్సెస్ చేయకుండా యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఏర్పాటు చేస్తున్నాం. మరోవైపు యూజర్ డేటా కోసం సైబర్ దాడులు జరుగుతున్నాయి. వీటి బారి నుంచి కాపాడుకునేందుకు చాలా మంది పాస్‌వర్డ్ మేనేజర్లను వినియోగిస్తుంటారు. వాటిలో గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్ కూడా ఒకటి. దీంతో అన్ని ఖాతాల పాస్‌వర్డ్, యూజర్‌నేమ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఒకచోట భద్రపరచుకోవచ్చు. మరి గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ హోమ్ స్క్రీన్‌కు ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
- ఆండ్రాయిడ్ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి పాస్‌వర్డ్ అండ్ అకౌంట్స్ సెక్షన్‌లో గూగుల్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది.
- తర్వాత కుడివైపు సెట్టింగ్స్ సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. వాటిలో యాడ్ షార్ట్‌కట్ టు యువర్ హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేస్తే కన్ఫర్మ్ చేయమని కోరుతూ పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది. అందులో యాడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్ ఐకాన్ మీ హోమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి మీరు సేవ్ చేసుకున్న పాస్‌వర్డ్‌లు చెక్ చేసుకోవచ్చు.
- గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్‌లో మీరు సేవ్ చేసుకునే పాస్‌వర్డ్‌లు హ్యాకింగ్‌కు అనుకూలంగా ఉంటే వెంటనే వాటిని మార్చుకోమని సూచిస్తుంది.
- ఇందులోని బిల్ట్-ఇన్ సెక్యూరిటీ మోడ్ మీ పాస్‌వర్డ్‌లను భద్రపరచడమే కాకుండా, బ్రౌజర్‌లో మీరు ఖాతాలను తెరిచేప్పుడు పాస్‌వర్డ్‌లను ఆటో ఫిల్ చేస్తుంది. దీంతో యూజర్ పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు.