తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

గూగుల్ కొత్త ఆప్షన్​తో యాడ్స్​కు చెక్! - google advertisements

ఆండ్రాయిడ్ వినియోగదారుల సమాచారాన్ని యాడ్ డెవలపర్లు ట్రాక్ చేయకుండా ప్రైవసీ నిబంధనలను కఠినం చేస్తోంది గూగుల్. యూజర్ల అడ్వర్టైజింగ్ ఐడీని డెవలపర్లకు కనిపించకుండా ఉంచే ఆప్షన్​ను వినియోగదారులకు కల్పించనుంది.

Google option Android users tracked by advertisers
గూగుల్ కొత్త ఆప్షన్​తో అడ్వర్టైజ్​మెంట్లకు చెక్!

By

Published : Jun 5, 2021, 12:24 PM IST

గూగుల్ తన ప్రైవసీ నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల సమాచారాన్ని అడ్వర్టైజింగ్ కంపెనీలు పసిగట్టకుండా కొత్త అప్​డేట్​ను తీసుకొస్తోంది. యాడ్ కంపెనీలు తమ ఫోన్లను ట్రాక్ చేయకుండా ఉంచే ఆప్షన్​ను ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ ఏడాది చివర్లో ఈ ఫీచర్​ను సంస్థ ప్రవేశపెట్టనుంది. గూగుల్ ప్లే(Google Play) సర్వీస్ అప్​డేట్ ద్వారా ఇది అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వెల్లడించింది. ఈ ఆప్షన్​ను వినియోగదారులు ఎంచుకుంటే.. డెవలపర్లు యూజర్ల అడ్వర్టైజింగ్ ఐడీని చూసే అవకాశం ఉండదు. దీని ద్వారా వ్యక్తిగత ప్రాధాన్యమైన(personalized ads) యాడ్​లు రావడం తగ్గుతుంది.

యాడ్ ట్రాకింగ్​పై యూజర్లకు మరింత నియంత్రణ కల్పించేందుకు గూగుల్(Google) కొన్ని నెలల నుంచి ప్రయత్నిస్తోంది. 2022 నాటికి ప్లే స్టోర్​లో సేఫ్టీ సెక్షన్​ను తీసుకురానున్నట్లు ఇదివరకే వెల్లడించింది.

ఇదీ చదవండి-భారత్​లో బెస్ట్​ ఎలక్ట్రిక్​ కార్లు ఇవే...

ABOUT THE AUTHOR

...view details