తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

టోల్​ గేట్స్​ లేని 'ఫ్రీ రూట్స్'​ కావాలా? గూగుల్​ మ్యాప్స్​లో​ ఇలా చేయండి!

Google Maps new Feature: టోల్ రుసుం చెల్లించకుండానే సుదూర ప్రయాణాలు చేసేందుకు గూగుల్ మ్యాప్స్​లో కొత్త ఫీచర్​ అందుబాటులోకి రానుంది. దేశంలోని 2000 రోడ్డు మార్గాల వివరాలను యూజర్లకు అందుబాటులో ఉంచనున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

Google Maps to roll out toll prices for Indian users
గూగుల్​ మ్యాప్స్​ కొత్త అప్డేట్​.. టోల్​ ఫీజు లేకుండానే ప్రయాణం!

By

Published : Apr 6, 2022, 3:31 PM IST

Google Maps Toll Price: సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు టోల్​ ఫీజు చాలా సార్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణ ఖర్చలకు ఇది అదనపు భారంగా మారుతుంది. టోల్​ ప్లాజా లేని ప్రత్యామ్నాయ మార్గాలు చాలా మందికి తెలియదు. దీంతో తప్పక టోల్ ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకునే గూగుల్​ మ్యాప్స్​లో సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. కొత్త అప్డేట్​లో టోల్​ ఫీజు చెల్లించాల్సిన రూట్లు, ఎన్నిసార్లు ఎంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది వంటి వివరాలను వినియోగదారులకు ముందుగానే తెలియజేస్తుంది. వారు చేరాల్సిన గమ్యస్థానాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఈ వివరాలను చూపిస్తుంది. అంతే కాదు ఏఏ టోల్ ప్లాజ్ వద్ద ఏ రోజు ఎంత ఫీజు చెల్లించాలి? పేమెంట్​ చెల్లించేందుకు యూపీఐ, క్రెడిట్​ కార్డు, డెబిట్ కార్డు సదుపాయం ఉందా? వంటి వివరాలను కూడా ఇకపై గూగుల్​ మ్యాప్స్​లో చూడవచ్చు. భారత్​లోని 2000 రోడ్డు మార్గాలు సహా అమెరికా, జపాన్, ఇండోనేషియాలో టోల్ ఫీజుల వివరాలను కొత్త అప్డేట్​లో చేర్చుతున్నట్లు గూగుల్​ తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలను ఈ జాబితాలో చేర్చనున్నట్లు బుధవారం ప్రకటన ద్వారా తెలియజేసింది.

Google Maps Update: ఒకవేళ యూజర్లు టోల్ ఫీజు చెల్లించొద్దనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా మ్యాప్స్​లో చూపించనున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఆండ్రాయిడ్​, ఐఓఎస్ యూజర్లకు ఈ నెల నుంచే టోల్ రుసుంకు సంబంధించిన వివరాలు ఆందుబాటులో ఉంటాయి. గూగుల్ మ్యాప్స్​ డైరెక్షన్స్​లో టాప్ రైట్ కార్నర్​లో ఉన్న మూడు డాట్​ల ట్యాప్ చేస్తే.. టోల్ ఫీజు లేని మార్గాన్ని ఎంపిక చేసుకునే ఆప్షన్ కూడా యూజర్లకు ఉంటుంది.

Google Maps Toll Free Route: గూగుల్ మ్యాప్స్​ను సులభంగా ఉపయోగించేలా యాపిల్ వాచ్​, ఐఫోన్ యూజర్లకు కొత్త అప్డేట్లను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ తెలిపింది. ఇందులో ట్రిప్ విడ్జెట్స్​, డైరెక్ట్ నావిగేషన్​తో పాటు సిరి, షార్ట్​కట్ యాప్​లో గూగుల్​ మ్యాప్స్​ను ఇంటిగ్రేట్​ చేయడం వంటి సదుపాయాలు ఉన్నట్లు పేర్కొంది. అంతేకాదు యాపిల్ వాచ్ యూజర్లు త్వరలోనే గూగుల్ మ్యాప్స్ నుంచి నేరుగా డెరెక్షన్స్​​ పొందవచ్చని చెప్పింది.

ఇదీ చదవండి:జీమెయిల్​లో ఈ​ షార్ట్​కట్స్​ గురించి మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details