Google Maps Live Location :తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు, తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు వాడే లైవ్ లొకేషన్‌ను ఇక నుంచి గూగుల్ మ్యాప్స్ యాప్ నుంచే నేరుగా షేర్ చేయవచ్చు. అలాంటి సదుపాయాన్ని అన్ని రకాల మొబైల్ యూజర్స్ కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది గూగుల్. అయితే ఇంతకుముందు ఈ రియల్‌టైమ్ లేదా లైవ్ లొకేషన్‌ను మన బంధువులకు, స్నేహితులకు పంపేదుకు వాట్సాప్ లాంటి ఇతర థర్డ్ పార్టీ యాప్‌లు వాడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు గూగుల్ లాంఛ్ చేసిన ఫీచర్‌తో అలాంటి ఏ అప్లికేషన్ల సాయం లేకుండానే సులువుగా మనకి కావాల్సిన వాళ్లకి కేవలం సాధారణ మెసేజ్ ద్వారానే మన లైవ్ లొకేషన్(రియల్‌టైమ్ లొకేషన్)ను షేర్ చేసుకోవచ్చు.
నో టైమ్ లిమిట్
ప్రస్తుతం వాట్సాప్ ద్వారా పంపే లైవ్‌లొకేషన్ షేరింగ్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి. 15 నిమిషాలు, 60 నిమిషాలు, 8 గంటలు ఇలా లిమిటెడ్ లైవ్ లొకేషన్ షేరింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అంటే ఈ సమయాలు దాటాయంటే లొకేషన్ షేరింగ్ దానికదే ఆగిపోతుంది. కానీ, గూగుల్ మ్యాప్స్ తెచ్చిన ఈ నయా ఫీచర్లో అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. అంటే టైమ్ లిమిట్ అంటూ ఏమీ ఉండదు. ఎంతసేపటి వరకైనా మీరు పంపిన రియల్‌టైమ్ లొకేషన్‌ను ఆన్‌లో ఉంచవచ్చు. మనం ఆపాలనుకున్నప్పుడు మాత్రమే దానిని ఆఫ్ చేయవచ్చు.
అవతలి యూజర్ కూడా
గూగుల్ లాంఛ్ చేసిన ఈ కొత్త ఫీచర్‌ను మీరు ఆస్వాదించాలంటే ముందుగా మీరు గూగుల్ మ్యాప్స్ యాప్‌లో లాగిన్ అయ్యి ఉండాలి. అంతేకాకుండా అవతలి యూజర్ లేదా మీకు సంబంధించిన వ్యక్తి కూడా గూగుల్ మ్యాప్స్ యాప్‌లో లాగిన్ అవ్వడం తప్పనిసరి. అయితే ఇప్పటికీ చాలామంది కొన్ని కారణాల వల్ల వాట్సాప్‌ను వినియోగించరు. అలాంటి వారికి గూగుల్ మ్యాప్స్ లైవ్ లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ఎంతగానో ఉపయోగపడనుందని అంటున్నారు కొందరు టెక్ ప్రియులు.
ఎలా వాడాలంటే?
- ముందుగా గూగుల్ మ్యాప్స్ యాప్‌లో లాగిన్ అవ్వాలి.
- యాప్‌లో కుడివైపున కనపడే ఫ్రొఫైల్ అకౌంట్‌పై క్లిక్ చేయాలి.
- అందులో కనిపించే 'Location Sharing' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- స్క్రీన్‌పై కనిపిస్తున్న 'New Share'పై క్లిక్ చేసి సమయాన్ని సెట్ చేసుకోవచ్చు.
- లేదా 'Until You Turn This Off' ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు.
- ఆ తర్వాత మీరు లైవ్‌లొకేషన్ పంపించాలనుకుంటున్న కాంటాక్ట్‌ను సెలెక్ట్ చేసుకొని మెసేజ్ సెండ్ చేయండి.
- షేరింగ్‌ను ఆపేయాలనుకుంటే ప్రొఫైల్ ఖాతాలోకి వెళ్లి 'Stop Sharing Option'పై క్లిక్ చేస్తే లొకేషన్ షేరింగ్ స్టాప్ అవుతుంది.