Google Maps Fuel Saving Feature : గూగుల్ మ్యాప్స్ భారతదేశంలో తాజాగా 'ఫ్యూయెల్ సేవింగ్' ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఎకో-ఫ్రెండ్లీ ఫీచర్ ఉపయోగించి, వాహనదారులు రద్దీ తక్కువ ఉన్న మార్గాల్లో ప్రయాణించి.. ఇంధనాన్ని చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. అంటే ఆయిల్ ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి.
గూగుల్ మ్యాప్స్ 2022 సెప్టెంబర్‌లోనే ఈ ఫ్యూయెల్ సేవింగ్ ఫీచర్‌ను యూఎస్, కెనడా, యూరోప్ దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. అక్కడ ఈ ఫీచర్ మంచి ఫలితాలు ఇవ్వడంతో.. తాజాగా భారతదేశంలోనూ దీనిని ప్రవేశపెట్టింది.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?
Eco Friendly Routing In Google Maps :వాహనదారులు ఇంధనాన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే.. గూగుల్ మ్యాప్స్‌లో ఈ ఫ్యూయెల్ సేవింగ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడు మీ వాహనంలో ఉన్న ఇంజిన్ రకం ఆధారంగా.. వివిధ మార్గాల్లో ప్రయాణిస్తే ఎంత ఇంధనం లేదా శక్తి వినియోగం అవుతుందో గూగుల్ మ్యాప్స్ లెక్కవేస్తుంది. ఏ మార్గంలో ప్రయాణిస్తే.. తక్కువ ఇంధనం ఖర్చు అవుతుందో సూచిస్తుంది. దీని వల్ల మీకు ఆర్థికంగా లాభం కలుగుతుంది. పైగా పర్యావరణానికి కూడా హితం కలుగుతుంది.
ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే..
వాస్తవానికి గూగుల్ మ్యాప్స్ రియల్-టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్ను, రహదారి పరిస్థితులను అంచనా వేస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా రద్దీగా ఉన్న ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయుంటే.. వెంటనే ఈ ఫ్యూయెల్ సేవింగ్ ఫీచర్‌ను ఆపేయండి. అప్పుడు గూగుల్ మ్యాప్స్ మీకు రద్దీ లేని ఫాస్టెస్ట్ రూట్‌ను తెలియజేస్తుంది. దీని వల్ల కూడా మీ వాహనంలోని ఇంధనం ఆదా అవుతుంది.
ఫ్యూయెల్ సేవింగ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోండిలా!
How To Activate Fuel Saving Feature In Google Maps :
- ముందుగా మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, లాగిన్ అవ్వండి.
- మీ ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి, Settings ఓపెన్ చేయండి.
- Navigation ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. తరువాత..
- Route optionsపై క్లిక్ చేసి.. అందులో ఫ్యూయెల్ ఎఫీషియంట్ రూట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
- Engine type సెక్షన్లో మీ వాహనంలో ఏ టైప్ ఇంజిన్ ఉందో నమోదు చేయండి.