జూన్ 1వ తేదీ నుంచి గూగుల్ ఫొటోస్ స్టోరేజ్‌లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. దీంతో గూగుల్ ఫొటోస్‌లో ఇకపై అపరిమితంగా హై క్వాలిటీ ఫొటోలను అప్‌లోడ్ చేయటం కుదరదు. ఇప్పటికే అప్‌లోడ్ చేసిన ఫొటోలు, వీడియోలు ఏవైనా సరే ఉచిత 15 జీబీ స్టోరేజ్ పరిధిలోకే వస్తాయి. ఇది నిండిపోతే, అదనపు స్టోరేజీ కోసం గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. లేదంటే కొన్ని ఫొటోల్ని తొలగించాలి. అయితే ఉచిత 15 జీబీ ఇతర గూగుల్ యాప్స్‌కు కూడా క్లౌడ్ స్టోరేజ్‌గా పనిచేస్తుంది. ఇప్పటికే ఫొటోలను గూగుల్ క్లౌడ్ స్టోరేజ్‌కు అప్‌లోడ్ చేయడం వల్ల కొంత మెమొరీని ఆక్రమించి ఉంటాయి. దాంతో జీమెయిల్ స్టోరేజ్ తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో జీమెయిల్ మెమొరీని పెంచుకోవడానికి(clear gmail inbox) ఏం చేయాలో చూద్దాం.
జీమెయిల్ అటాచ్‌మెంట్స్‌ను డిలీట్ చేయడం..
- మొదటగా మీ కంప్యూటర్‌లో జీమెయిల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో "has:attachment larger:10M" అని టైప్ చేయండి.
- 10 ఎంబీల కన్నా ఎక్కవ మెమొరీ ఆటాచ్‌మెంట్లు ఉన్న మెయిల్స్ ప్రత్యక్షమవుతాయి.
- వాటిల్లో అవసరం లేని మెయిల్స్‌కు టిక్ పెట్టి డిలీట్ చేయండి.
- ఆ తర్వాత ట్రాష్‌లోకి వెళ్లి బిన్ను క్లియర్ చేయండి.