Google Deleting YouTube and Gmail : మీకు జీమెయిల్ (Gmail Account) అకౌంట్ ఉందా? యూట్యూబ్ (YouTube Account) కూడా క్రియేట్ చేసుకున్నారా? అయితే మీకు ఓ హెచ్చరిక! సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఏ క్షణమైన మీ అకౌంట్లను డెలిట్ చేయెచ్చు. ఈ విషయాన్ని కొన్ని వారాల క్రితమే ప్రకటించింది. అయితే.. ఏ అకౌంట్లను డెలిట్ చేస్తుంది? అంటే.. యాక్టివ్ లో ఉన్నవాటికి ముప్పు లేదు. చాలా కాలంగా వాడకుండా ఉన్న మెయిల్స్ ను డెలిట్ చేస్తామని చెప్పింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు కూడా ప్రకటించింది.
ఈ రూల్స్ ప్రకారం జీమెయిల్ (Gmail), యూట్యూబ్ (YouTube) ఖాతాదారులను గూగుల్ హెచ్చరిస్తోంది. నిబంధనలు పాటించే వారికి ఇబ్బంది లేదని చెప్తోంది. డిసెంబర్ 2023 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని గూగుల్ పేర్కొంది. అకౌంట్లను డిలీట్ చేసే ప్రమాదం ఉన్న వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు.. 8 నెలల ముందు నుంచే వార్నింగ్ మెయిల్ పంపుతోంది.
Gmail Tips : ఈ సింపుల్ టిప్స్ & ట్రిక్స్ తెలుసా?.. వీటితో మీ పనులు మరింత ఈజీగా!
ఇన్‌యాక్టివ్ ఖాతాలపై దృష్టి:
Google Focus on Inactive Accounts: యాక్టివ్ గా లేని జీమెయిల్ (GMail), యూట్యూబ్ ఖాతాలను గుర్తించే పనిలో ప్రస్తుతం గూగుల్ ఉంది. 2023 డిసెంబర్ నుంచి ఇనాక్టివ్ ఖాతాల తొలగింపు ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. ఇన్‌యాక్టివ్‌లో ఉన్న మెయిల్, యూట్యూబ్ ఖాతాలను తొలగించడం ద్వారా అనవసర భారాన్ని తగ్గించుకోవడంతో పాటు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్‌ను కూడా తగ్గించుకోవచ్చని గూగుల్ భావిస్తోంది. యాక్టివ్‌లో లోని ఖాతాలను డెలిట్ చేస్తే, ఆయా అకౌంట్లలోని మెయిల్స్, డాక్యుమెంట్స్, ఫొటోస్, డ్రైవ్, క్యాలెండర్, యూట్యూబ్ల్లోని సమాచారం సహా మొత్తం కంటెంట్ అంతా డెలిట్ అవుతుంది.
దశల వారీగా తొలగింపు..:ఇన్‌యాక్టివ్ ఖాతాల తొలగింపు ప్రక్రియను దశలవారీగా చేపట్టనున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది. అకౌంట్‌ను క్రియేట్ చేసిన తరువాత, ఒక్కసారి కూడా ఉపయోగించని ఖాతాలను మొదట డిలీట్ చేస్తామని వివరించింది. ఆ తర్వాత.. రెండేళ్లుగా యాక్టివ్‌గా లేని ఖాతాలను డెలిట్ చేస్తామని ప్రకటించింది. డెలిట్ చేసే ముందు.. ఆ అకౌంట్‌కు ఉన్న రికవరీ అకౌంట్‌ను కూడా తొలగించబోతున్నామని హెచ్చరిస్తూ మెయిల్స్ పంపిస్తామని తెలిపింది. అయితే, వ్యక్తిగత జీమెయిల్ ఖాతాలకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుందని, వ్యాపార సంస్థలు, పాఠశాలలకు సంబంధించిన జీమెయిల్ ఖాతాలను తొలగించబోమని స్పష్టం చేసింది.