గూగుల్ ఇటీవలే ఆండ్రాయిడ్ 12లో (Android 12) 5వ వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది ఫైనల్ వెర్షన్‌గా డెవలెపర్స్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రజలకు ఇది చేరువ కావాలంటే మరికొన్ని వారాలు వేచిచూడక తప్పదు అని చెబుతోంది. పూర్తిస్థాయి ఆండ్రాయిడ్ వెర్షన్ విడుదలకు ముందే.. దీనికి తగినట్లు యాప్‌లను సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే డెవలెపర్స్కు సూచించింది. కానీ ఇది ఎప్పుడు విడుదల చేస్తుందన్న విషయాన్ని కచ్చితంగా ప్రస్తావించలేదు. కానీ అక్టోబర్ మొదటివారంలో ఉండొచ్చిన టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ముహుర్తం ఖరారు..!
ఆండ్రాయిడ్ 12 విడుదలపై ఇప్పటికే స్పష్టమైన సమాచారం లేనప్పటికీ.. పిక్సిల్ స్మార్ట్ఫోన్లకు వచ్చే నెల 4న ఆండ్రాయిడ్ 12 అందుబాటులోకి రానున్నట్లు ఎస్డీఏ డెవలెపర్స్ పేర్కొంది. దీనికి సంబంధించిన సోర్స్ కోడ్‌ను అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (ఏఓఎస్‌పీ)లో పబ్లిష్ చేసిందని చెప్పుకొచ్చింది. ఏదేమైనప్పటికీ.. ఆ రోజే గూగుల్ పిక్సెల్ సిరీస్‌లోని స్మార్ట్ఫోన్లలో అందుబాటులోకి తీసుకురానుందని పేర్కొంది.
మారే అవకాశాలు లేకపోలేదు..