తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Google Chrome: ధరలు మారితే గూగుల్ క్రోమ్ చెప్పేస్తుందిలా..!

ఆన్‌లైన్‌ షాపింగ్ చేసే యూజర్స్‌ను ఆకర్షించేందుకు టెక్‌ దిగ్గజం గూగుల్ క్రోమ్​ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. యూజర్స్‌కు మెరుగైన ఆన్‌లైన్‌ షాపింగ్‌ అనుభూతిని అందించేందుకు ట్రాక్‌ ప్రైసెస్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇది యూజర్స్‌ వెతికిన, వెతుకుతున్న ఉత్పత్తులకు సంబంధించి ధరల్లో మార్పులు జరిగితే గూగుల్ క్రోమ్‌ యూజర్స్‌కు తెలియజేస్తుంది.

Google Chrome track prices
Google Chrome track prices

By

Published : Dec 19, 2021, 8:56 PM IST

Google chrome: ప్రస్తుతం షాపింగ్ అంగళ్ల నుంచి ఆన్‌లైన్‌కి చేరింది. గతంతో పోలిస్తే ఆన్‌లైన్‌ షాపింగ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్ల నుంచి బయటికి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఎక్కువ మంది ఆన్‌లైన్‌ కొనుగోళ్లకే మొగ్గు చూపారు. దీంతో ఆన్‌లైన్‌ షాపింగ్ చేసే యూజర్స్‌ను ఆకర్షించేందుకు టెక్‌ దిగ్గజ కంపెనీలు సైతం తమ వంతు కృషి చేస్తున్నాయి. తాజాగా గూగుల్ క్రోమ్​ యూజర్స్‌కు మెరుగైన ఆన్‌లైన్‌ షాపింగ్‌ అనుభూతిని అందించేందుకు సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ట్రాక్‌ ప్రైసెస్‌ పేరుతో తీసుకురానున్న ఫీచర్‌తో యూజర్స్‌ వెతికిన, వెతుకుతున్న ఉత్పత్తులకు సంబంధించి ధరల్లో మార్పులు జరిగితే గూగుల్ క్రోమ్‌ యూజర్స్‌కు తెలియజేస్తుంది. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఈ ఫీచర్‌ను ముందుగా ఆండ్రాయిడ్ యూజర్స్‌కు పరిచయం చేయనున్నట్లు సమాచారం. తర్వాత ఐఓఎస్‌ యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అలానే ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్‌ను ముందు అమెరికాలో, ఆ తర్వాత ఇతర దేశాల్లో పరిచయం చేయనున్నట్లు గూగుల్ తెలిపింది.

ట్రాక్‌ ప్రైసెస్‌ ఎలా పనిచేస్తుంది

యూజర్స్ తమకు కావాల్సిన ఉత్పత్తుల ధరలు తెలుసుకునేందుకు ప్రతిసారీ ఆయా ఉత్పత్తులు లేదా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో వెతుకుతుంటారు. అలా వెతికిన తర్వాత పెరిగిన లేదా తగ్గిన ధరల వివరాలను గూగుల్ క్రోమ్‌లో ట్యాబ్‌ ఓపెన్‌ చేస్తే అందులోని గ్రిడ్‌లో చూపిస్తుంది. ఉదాహరణకు మీరు ఐఫోన్ ధర గురించి క్రోమ్ బ్రౌజర్‌లో వెతికారు. తర్వాత ఐఫోన్ ధర తగ్గింది. ఆ వివరాలను క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసిన వెంటనే అందులోని గ్రిడ్‌లో మీకు కనిపిస్తుంది. దానితోపాటు.. సదరు ప్రొడక్ట్‌కు దగ్గరగా ఉన్న ఇతర ఉత్పత్తుల ధరలను కూడా అందులో చూపిస్తుంది. ఈ ఫీచర్‌ కోసం యూజర్స్‌ ముందుగా తమ ఫోన్లలో క్రోమ్‌ బ్రౌజర్‌ ఓపెన్ చేయాలి. అందులో కుడివైపు పైభాగంలో మూడు చుక్కలపై క్లిక్ చేస్తే క్రోమ్‌ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ట్రాక్‌ ప్రైసెస్‌ (అందుబాటులోకి వచ్చాక) ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఎనేబుల్ చేస్తే మీ క్రోమ్‌ బ్రౌజర్‌లో ఎన్ని రకాల ఉత్పత్తుల వెతికారో వాటి ధరలు మారినప్పుడు మీకు ట్యాబ్‌ గ్రిడ్స్‌లో చూపిస్తుంది.

Search with Google Lens

ఇదేకాకుండా గూగుల్‌ మరో కొత్త ఫీచర్‌ను కూడా క్రోమ్‌ సెర్చ్ అడ్రస్‌ బార్‌లో పరిచయం చేసింది. దీంతో యూజర్స్‌ ఫోన్‌ కెమెరాతో తమకు కావాల్సిన సమాచారం గురించి సులువుగా వెతకవచ్చు. ఉదాహరణకు మీరు విండో షాపింగ్ చేస్తున్నప్పుడు మీ కంటపడిన వస్తువు గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. వెంటనే మీ ఫోన్‌లో గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి సెర్చ్‌ బార్‌లో కెమెరా సింబల్‌పై క్లిక్ చేయాలి. తర్వాత గూగుల్ లెన్స్ ఓపెన్ అవుతుంది. దాంతో మీరు వివరాలు తెలుసుకోవాలనుకుంటున్న వస్తువును ఫొటో తీస్తే దానికి సంబంధించిన సమాచారం వేర్వేరు చోట్ల నుంచి మీకు చూపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొద్ది మంది యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. ఒకవేళ మీ ఫోన్‌లో ఈ ఫీచర్‌ రాకుంటే ప్లేస్టోర్‌లోకి వెళ్లి గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసి చూడండి.

ఇదీ చూడండి:నిత్యం నెట్టింట్లో జనం.. ఒక్క నిమిషంలో ఇన్ని చేస్తున్నారా?

ABOUT THE AUTHOR

...view details