Android features: ఆండ్రాయిడ్ ఫోన్స్ కోసం గూగుల్ సరికొత్త అప్డేట్స్ను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లతో పాటు ఇతర వినియోగదారుల కోసం డిజిటల్ కార్ కీ, కొత్త విడ్జెట్లు, గూగుల్ ఫోన్స్‌లో మెమొరీలు, అప్‌డేటెడ్ ఎమోజీ కిచెన్, ప్రైవసీ టూల్ ఫీచర్లు ఈ అప్‌డేట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Digital Car Key Functionality
యాపిల్ కార్‌కీ తరహాలో డిజిటల్ కార్ కీ తీసుకువస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ కీ ద్వారా జేబుల్లోంచి స్మార్ట్ ఫోన్ బయటకు తీయకుండానే కారును అన్‌లాక్ చేసే వీలు ఉంటుంది. బీఎండబ్ల్యూ కార్లకు పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఫోన్ యూజర్లు మాత్రమే ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు
అయితే ప్రస్తుతం ఇది ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Family Bell Feature
రోజువారీ షెడ్యూల్స్‌కు సంబంధించి వినియోగదారులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఫ్యామిలీ బెల్ అనే కొత్త టూల్‌ను ఆండ్రాయిడ్ పరిచయం చేయనుంది.
దీని ద్వారా ముఖ్యమైన టాస్క్‌లకు సంబంధించి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను అప్రమత్తం చేయవచ్చు.
హాలిడేస్‌లో మొక్కలకు నీళ్లు పోయడం, ఫ్యామిలీతో సినిమాకు వెళ్లడం వంటి ఇతర ఇంటి పనులకు సంబంధించి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది.
ఆ అలర్ట్స్ ఫోన్, హోం స్పీకర్లు, స్మార్ట్ డిస్ప్లేల ద్వారా వస్తాయి.