దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో జీ-మెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ సహా పలు యాప్‌లను బ్లాక్ చేయనున్నట్లు సమాచారం. సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లను అప్డేట్ చేసుకోవచ్చు. అయితే కొందరు.. పాత ఫోన్లు ఆగిపోయేంత వరకు ఉపయోగించడానికి ఇష్టపడతారు. అటువంటి పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న అన్ని యాప్‌లను నిలిపివేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో యూజర్లు తమ గూగుల్ అకౌంట్‌తో సైన్ఇన్ చేయకుండా నిరోధించే ప్రణాళికలను సంస్థ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఇటీవల ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కూడా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంది.
ఏ ఆండ్రాయిడ్ వెర్షన్లో..
గూగుల్ పరిచయం చేసిన ఆండ్రాయిడ్ వెర్షన్లకు ఏదైనా తీపి పదార్థం పేరును పెట్టడం ఆనవాయితీ. అయితే డిసెంబరు 2010లో జింజర్‌బ్రెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేయగా.. దాదాపు 11 ఏళ్ల తర్వాత, ఇప్పుడు దానికి సంబంధించిన సేవలు ఆపేయాలని గూగుల్ నిర్ణయం తీసుకుంది. యూజర్ల భద్రత కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది.
ఎప్పటి నుంచి పనిచేయవు..