దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం జీమెయిల్ సేవలు (Dmail Down in India) నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు మెయిల్స్ పంపడం, స్వీకరించడంలో అంతరాయం (Gmail Down) ఏర్పడింది.
డౌన్ డిటెక్టర్ పోర్టల్ ప్రకారం.. 73 శాతం మంది వినియోగదారులు వెబ్సైట్లో, 14 శాతం మంది సర్వర్ కనెక్షన్లో, 12 శాతం మంది లాగిన్ అవడంలో సమస్య ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ సమస్యను గూగుల్ (Gmail Down News) పరిష్కరించింది.
గూగుల్ అందిస్తోన్న ఉచిత మెయిల్ సర్వీస్.. 'జీమెయిల్'. జీమెయిల్‌ను యాక్సెస్ చేయడంలో సమస్య (Gmail Outage) ఎదుర్కొన్నట్లు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో పలువురు వినియోగదారులు ఫిర్యాదులు చేశారు.