Gmail app update: తమ వినియోగదారుల కోసం గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జీమెయిల్ యాప్‌లోని 'గూగుల్ చాట్' ఫీచర్ ద్వారా వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ సదుపాయాన్ని కల్పించనుంది. జీమెయిల్ యాప్ అప్డేట్ ద్వారా యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ వారమే దీన్ని తీసుకురానుంది.
Audio video call with gmail: ఇప్పటికే ఆడియో, వీడియో కాల్స్, చాట్ కోసం హ్యాంగ్ అవుట్స్, డ్యుయో, అల్లో, గూగుల్ ప్లస్ వంటి వివిధ యాప్‌లను గూగుల్ తీసుకువచ్చింది. కానీ, ఈ యాప్‌ల అవసరం లేకుండానే తమ వినియోగదారులు సులభంగా, వేగంగా ఇతరులతో మాట్లాడుకునేందుకు వీలు కల్పించాలని గూగుల్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే.. జీమెయిల్ యాప్ అప్డేటెడ్ వెర్షన్లో ఈ తాజా సదుపాయాల్ని తీసుకురానుంది.
వన్-టు-వన్ మాత్రమే..
Gmail google chat: జీమెయిల్ యాప్‌లోని గూగుల్ చాట్ సర్వీసు ద్వారా ప్రస్తుతానికైతే ఒక్కరితో మాత్రమే మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. గ్రూప్ చాట్‌లో పాల్గొనాలంటే మాత్రం గూగుల్ మీట్ వంటి ఇతర యాప్‌లను వినియోగించుకోవాల్సిందే.
"కొంతమంది ఆఫీసులో ఉన్నప్పుడు, మరికొంత మంది మిగతా ప్రదేశాల్లో ఉన్నప్పుడు... ఈ ఫీచర్ హైబ్రిడ్ వర్క్ వరల్డ్‌లో సహోద్యోగులతో అనుసంధానమవ్వడాన్ని సులభతరం చేస్తుందని మేం ఆశిస్తున్నాం. ఈ సదుపాయం ద్వారా సులభంగా చాట్ నుంచి వీడియో, ఆడియోకు వినియోగదారులకు కావాల్సిన విధంగా మారవచ్చు. ఇది ఇతరులతో సహకరించుకుంటూ తమ పని వేగవంతంగా పూర్తి చేసేందుకు సాయపడుతుంది" అని గూగుల్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చూడండి:వాట్సాప్ కొత్త అప్డేట్.. ఇకపై 7 రోజులు కాదు.. 24 గంటలే
ఇదీ చూడండి:షియోమీ నుంచి సరికొత్త మొబైల్- ఫీచర్లు ఇవే..!