తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మీ జీమెయిల్​ ఖాతాలో వేరేవాళ్లు లాగిన్ అయ్యారని డౌటా, చెక్ చేయండిలా - జీమెయిల్​

ప్రస్తుత కాలంలో అత్యధిక మంది వినియోగించే ఈమెయిల్‌ సర్వీసుల్లో గూగుల్‌ సంస్థ అందించే జీమెయిల్‌ ముందుంటుంది. పర్సనల్​గా, ప్రొఫెషనల్​గా ఈ అప్లికేషన్​ను దాదాపు అందరూ వినియోగిస్తున్నారు. అలాంటి జీమెయిల్ ఖాతాను సురక్షితంగా ఉంచడం చాలా అవసరం. దాని కోసం ఈ చిట్కాలు పాటించండి.

Gmail account Security
How to see if anyone is secretly logging into your Gmail account

By

Published : Aug 23, 2022, 5:00 PM IST

Gmail account Security: ఈ ఆధునిక కాలంలో మొబైల్​ ఫోన్​, కంప్యూటర్, ఇంటర్నెట్​ కనెక్షన్​ ఉంటే ప్రపంచం మన అరచేతిలో ఉంటుంది. దానికి తోడు వివిధ కంపెనీలు రకరకాల అప్లికేషన్లతో ఇంటర్నెట్​ వాడకాన్ని సులభం చేశాయి. అలాంటి వాటిలో మనం ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్ 'గూగుల్ మెయిల్'​. అయితే మీరు జీమెయిల్​ వాడుతున్నప్పటికీ, దీని నుంచి పూర్తి ప్రయోజనాలు ఎలా పొందాలో తేలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జీమెయిల్​ ఖాతాను సురక్షితంగా ఉంచేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.

మీ జీమెయిల్​లో ఎవరైనా లాగిన్ అయ్యారేమో తెలుసుకోవడం ఇలా..
⦁ మీ గూగుల్​ ఖాతాలోకి వెళ్లండి
⦁ ఎడమ వైపున ఉన్న నావిగేషన్​ ప్యానెల్​ నుంచి "సెక్యూరిటీ" ఆప్షన్​ పై క్లిక్​ చేయండి
⦁ తర్వాత "యువర్ డివైజైస్​" ప్యానెల్​ నుంచి "మేనేజ్​ ఆల్​ డివైజెస్​" ఆప్షన్ ఎంచుకోండి

ప్రస్తుతం మీరు ఏ డివైజ్​ నుంచి జీమెయిల్​ ఖాతాలోకి లాగిన్​ అయ్యారో ఇక్కడ కనిపిస్తుంది. గత కొంత కాలం నుంచి లాగిన్ అయిన వివరాలు కూడా కనిపిస్తాయి. ఇంకా వివరాలు కావాలనుకుంటే ఆ డివైజ్​ మీద క్లిక్​ చేయాలి. లాగిన్​ వివరాలతో పాటు ఎప్పుడెప్పుడు ఖాతాలోంచి లాగౌట్ అయ్యామో కూడా తెలుసుకోవచ్చు. మన ఖాతా గురించి పూర్తి వివరాలు తెసుకునేందుకు గూగుల్​ మనకు సహకరిస్తుంది. ఒకవేళ లాగిన్​ అయింది మీరు కాకుంటే ఇక్కడ నుంచి సైన్​ ఔట్​ కావచ్చు.

అవసరం లేదంటే 'అండూ' చేయెచ్చు: కొన్నిసార్లు మనం అనుకోకుండా మెయిల్​ సెండ్​ చేస్తాం. ఆ పొరపాటును సరిదిద్దుకునేందుకు జీమెయిల్​లో అండూ ఆప్షన్​ ఉంటుంది. అయితే ఇందుకోసం మనం డిలే సమయాన్ని సెట్​ చేయాల్సి ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలోగా మనం అండూ క్లిక్ చేస్తే ఆ మెయిల్​ను అవతలి వారు చూడలేరు.

⦁ జీమెయిల్​ వెబ్​సైట్​ ఓపెన్ చేసి, ఎడమవైపున ఉన్న 'గేర్'​ ఐకాన్​ పై క్లిక్​ చేయండి.
⦁ అందులో 'సెట్టింగ్స్​'ను సెలెక్ట్ చేసుకోండి.
⦁ తర్వాత జనరల్​ ట్యాబ్​లో 'అండూ సెండ్' ఆప్షన్ సెలెక్ట్​ చేసుకోండి.
⦁ అనంతరం అక్కడ డ్రాప్​ డౌన్​ మెనూలో 5 సెకన్లు, 10 సెకన్లు, 20 సెకన్లు, 30 సెకన్లు అని కనిపిస్తుంది. అక్కడ టైమ్​ సెట్​ చేసుకోండి.
⦁ తర్వాత 'సేవ్​ ఛేంజెస్'​ అనే బటన్​పై క్లిక్ చేయండి.

ఇవీ చూడండి:వాట్సాప్​లో తెలియకుండా మెసేజ్​లు డిలీట్​ చేస్తున్నారా, ఇది మీ కోసమే

గూగుల్ పాస్​వర్డ్ మేనేజర్​ గురించి ఇవి తెలుసుకోండి

ABOUT THE AUTHOR

...view details