తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

జీమెయిల్‌ అకౌంట్ లాక్​ అయిపోయిందా? ఇలా చేయండి! - జీమెయిల్ అకౌంట్ రికవరీ

Gmail Account Recovery: ప్రస్తుతం ప్రతి ఒక్కరు జీ-మెయిల్ వాడుతున్నారు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడాలన్నా.. జీమెయిల్‌ ఖాతా తప్పనిసరి. మరి ఇంత ప్రాధాన్యం కలిగిన జీమెయిల్‌ లాక్‌ కావడం, యాక్సెస్‌ (ఐడీ, పాస్‌వర్డ్‌) కోల్పోవడం జరిగితే..? ఏం చేయాలి..?.

Gmail Account Recovery
జీమెయిల్‌

By

Published : Jan 31, 2022, 5:17 PM IST

Gmail Account Recovery: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్న జీమెయిల్‌ సేవల గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడాలంటే జీమెయిల్‌ ఖాతా తప్పనిసరి. గూగుల్ ఇతర సేవలు, డేటా, ఫైల్స్‌ యాక్సెస్‌, షేరింగ్‌కూ జీ-మెయిలే కీలకం. మరి ఇంత ప్రాధాన్యం కలిగిన జీమెయిల్‌ లాక్‌ కావడం, యాక్సెస్‌ (ఐడీ, పాస్‌వర్డ్‌) కోల్పోవడం జరిగితే..? ఎలా అని ఆలోచిస్తున్నారా..! ఖాతాను తిరిగి పునరుద్ధరించడానికి ఇవీ ట్రై చేయండి.

  • ఒకవేళ మీకు జీమెయిల్‌ ఐడీ గుర్తు లేనట్లయితే ఫోన్‌ నంబర్‌తో సైన్ఇన్‌ అవ్వండి. అలాగే 'Forgot password'పై క్లిక్ చేసి ఫోన్‌ నంబర్‌తో పాస్‌వర్డ్‌ను రీసెట్‌ చేసుకోవడం సులువైన మార్గం.
  • పైపద్ధతి విఫలమైతే ఐఫోన్‌, ఐప్యాడ్‌లో నేరుగా గూగుల్‌ ఖాతాతో లాగిన్‌ కావడం ద్వారా జీమెయిల్‌ను పునరుద్ధరించవచ్చు. ఇక్కడ ఎటువంటి ఐడీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాల్సిన పనిలేదు. కానీ, మొబైల్‌ నంబర్‌ వంటి వ్యక్తిగత వివరాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్‌ డివైస్‌లలో Google Authenticator యాప్‌ను ఉపయోగించి ఖాతాను తిరిగి యాక్సెస్‌ చేసుకోవచ్చు.
  • జీమెయిల్‌ లాకైన సందర్భాల్లో సైన్‌ఇన్‌ చేయడానికి తరచూ వినియోగించే కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లను వాడండి. అందులోనూ మీరు సాధారణంగా వినియోగించే క్రోమ్‌, సఫారీ బ్రౌజర్‌ను ఉపయోగించండి. జీమెయిల్‌ లాక్‌ కావడం కంటే ముందే ముఖ్యంగా మేనేజ్‌ గూగుల్‌ ఖాతాలోకి వెళ్లి సెక్యూరిటీలో రికవరీ ఇమెయిల్‌, ఫోన్‌ నంబర్‌ సెట్‌ చేసుకోవడం మేలు. తద్వారా పాస్‌వర్డ్‌ లాగిన్‌కు సంబంధించిన ఓటీపీ వివరాలను గూగుల్‌ రికవరీ ఇమెయిల్‌, నంబర్‌కు పంపే అవకాశం ఉంటుంది.
  • అయినా ఖాతా రికవరీ కాకుంటే గూగుల్‌ మిమ్మల్ని పలు సెక్యూరిటీ ప్రశ్నలకు అడగవచ్చు. ఈ ప్రశ్నలను దాటవేయకుండా ఎక్కువ వాటికి సమాధానమిస్తూ వెళ్లండి.

ABOUT THE AUTHOR

...view details