తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

అలా చేస్తే వారికి కంటి చూపు తిరిగి రావడం ఖాయం!

40 ఏళ్ల నుంచి అంధకారం అనుభవిస్తున్న ఓ వ్యక్తికి జీన్ థెరపీతో కంటి చూపును తిరిగి తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. నీటిలో పెరిగే నాచు తరహా జీవి జన్యువును కంటిలోని రెటీనాకు జత చేసి.. చూపును తిరిగి రాబట్టారు.

jene therapy
జీన్ థెరపీ

By

Published : May 30, 2021, 4:08 PM IST

ఆ వ్యక్తి వయసు 58. 40 ఏళ్ల నుంచి అంధకారమే ఆయన ప్రపంచం. చీకటీ వెలుతురుకు తేడా కూడా అతనికి తెలియవు.

కానీ, ఇదంతా గతం. జీన్ థెరపీ చేయించుకున్నప్పటి నుంచి ఆయన కంటికి అన్ని వస్తువులు కనిపిస్తున్నాయి!

అసలీ జీన్ థెరపీ కథేంటంటే?

జీన్ థెరపీలో భాగంగా కంటిలోని రెటీనాకు వెలుతురును గుర్తించే మాలిక్యూల్స్ జత చేస్తారు. రెటీనాలోకి ఆల్గే(నీటిలో పెరిగే ఒకరకమైన నాచు) జన్యువును ప్రవేశపెడతారు. ఈ తరహా ప్రక్రియను ఆప్టోజెనెటిక్స్ అంటారు. తొలిసారి ఒక వ్యక్తి దృష్టిని మెరుగుపర్చేందుకు ఆప్టోజెనెటిక్స్ విధానాన్ని విజయవంతంగా ప్రయత్నించారు ఐరోపా, అమెరికా శాస్త్రవేత్తలు.

.

రెటినిటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి కారణంగా 40 ఏళ్ల క్రితం చూపు కోల్పోయిన ఓ వ్యక్తిపై వీరు పరిశోధన నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక కంటికి జీన్ థెరపీ చేసి... క్రిమ్సన్ అనే ఆల్గే జన్యువును కంటిలోని రెటీనాకు జత చేశారు. క్రిమ్సన్ అనేది ఏకకణ జీవికి చెందిన జన్యువు. వీటికి సూర్యరశ్మిని గ్రహించే గుణం ఉంటుంది. దీని ద్వారా చూపు మళ్లీ తిరిగి తీసుకొచ్చారు పరిశోధకులు.

"కంటిలోని గంగ్లియాన్స్ అనే రెటీనా కణాలను మెరుగుపర్చేందుకు ఆల్గే జన్యువును వాటికి జత చేస్తాం. తద్వారా వెలుతురుకు గంగ్లియాన్స్ ప్రతిస్పందిస్తాయి. దృశ్య సంకేతాలను మెదడుకు చేరవేస్తాయి. ఈ విధానం ద్వారా ఒక కొత్త శాస్త్ర విభాగం పురుడుపోసుకుంది."

-బోటోండ్ రోస్కా, అధ్యయనకర్త, బాసెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్

అయితే, రోగి నేరుగా వస్తువులను చూసే అవకాశం ఉండదు. ఇందుకోసం ఎలక్ట్రానిక్ కళ్లద్దాలు ధరించాల్సి ఉంటుంది. ఇవి వాతావరణంలోని వెలుతురును గ్రహించి.. ఆ దృశ్యాలను కంటిలోని రెటీనాకు హై ఇంటెన్సిటీ వేవ్​లెంగ్త్​లో పంపిస్తాయి. ఈ సంకేతాలను క్రిమ్సన్ మాలిక్యూల్ అందుకుంటుంది.

.

ఈ పరిశోధనకు జెన్​సైట్ బయోలాజిక్స్ అనే ఫ్రెంచ్ కంపెనీ నిధులు సమకూర్చింది.

"చూపు కోల్పోయిన వ్యక్తి తొలుత ఎలాంటి మార్పులను గ్రహించలేదు. తర్వాత ఈ అద్దాల ద్వారా క్రమంగా వివిధ ఆకారాలను గుర్తుపట్టాడు. ఆప్టోజెనెటిక్స్ ద్వారా ప్రయోజనం పొందిన తొలి వ్యక్తి అతడే. మరింత శిక్షణ ఇస్తే.. ఇతర వస్తువులనూ సులువుగా గుర్తించే అవకాశం ఉంది."

-జాస్ అలైన్ సాహెల్, జెన్​సైట్ కో-ఫౌండర్, పిట్స్​బర్గ్ యూనివర్సిటీ పరిశోధకుడు

పరిశోధనలో భాగంగా అనేక మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు సాహెల్ తెలిపారు. అయితే ప్రస్తుతం వివరాలు వెల్లడించిన వ్యక్తికి మాత్రమే కళ్లద్దాలను ఉపయోగించినట్లు చెప్పారు. రోగికి తిరిగి వచ్చిన కంటి చూపు చాలా తక్కువ స్థాయిలోనే ఉందని స్పష్టం చేశారు. కళ్లద్దాల ద్వారా చూసే దృశ్యాలన్నీ ఏకవర్ణంలోనే కనిపిస్తాయని, వాటి స్పష్టత కూడా అంతంతమాత్రంగానే ఉంటాయని చెప్పారు. అయితే, కళ్లద్దాలను మరింత అభివృద్ధి చేసి, రోగికి శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ దిశగా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు.

ఇవీ చదవండి-

ABOUT THE AUTHOR

...view details