ఇప్పుడంతా ఇయర్‌బడ్‌ల ట్రెండే. వైర్‌లు లేకుండా చెవుల్లో హెడ్‌ఫోన్‌లు పెట్టుకుని హాయిగా మ్యూజిక్, కాల్స్ మాట్లాడేందుకు అందరూ ఇయర్‌బడ్‌లకే ఓటేస్తున్నారు. కాకపోతే ఖరీదు విషయంలోనే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ బడ్జెట్‌లో ఏమున్నాయా? అని ఆరా తీస్తారు. అందుకే ఈ లెనొవో ఇయర్‌బడ్‌లు. ‘హెచ్‌టీ20’ పేరుతో వీటిని ప్రవేశపెట్టింది. ఆకట్టుకునే లుక్‌తో యువత మనసుని దోచేస్తున్నాయి. ప్రత్యేక ఛార్జింగ్ కేస్‌తో జీన్స్ పాకెట్‌లో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్ఛు లెనొవో ఈక్యూ టెక్నాలజీ, ఎక్స్ బాస్‌తో మ్యూజిక్ ట్రాక్స్ సౌండ్ అదుర్సే. వీటి మొత్తం ఛార్జింగ్ సమయం 25 గంటలు. అంటే.. నాన్‌స్టాప్‌గా ఒక రోజంతా పాటలు వినొచ్ఛు.
ETV Bharat / science-and-technology
గ్యాడ్జెట్ గురూ.. సౌండ్‌లో అదుర్సే! - lenovo ht20 earbuds
పాటలు వింటూ పని చేయాలన్నా, కాసేపు నడవాలన్నా, స్నేహితులతో గంటలు గంటలు ఫోన్ మాట్లాడాలన్నా చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండాల్సిందే. ఇయర్‌ఫోన్స్‌తో మాట్లాడుతున్నప్పుడు దాని వైర్ మన పనులకు అడ్డొస్తే చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు అందరి చూపు ఇయర్‌బడ్స్ వైపే.
![గ్యాడ్జెట్ గురూ.. సౌండ్‌లో అదుర్సే! Lenovo H20 earbuds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6906366-70-6906366-1587624968796.jpg)
ఇయర్ బడ్స్
ధర రూ.3,799
Last Updated : Feb 16, 2021, 7:51 PM IST