Android And IOS Features : ఆండ్రాయిడ్, ఐఓఎస్ పనిచేసే వేదిక ఒకటైనా.. రెండు వేర్వేరు ధృవాలు అని చెప్పుకోవచ్చు. ఈ రెండు మొబైల్ ఓఎస్‌లతోనే ప్రపంచంలోని అత్యధిక స్మార్ట్‌ఫోన్లు పనిచేస్తున్నాయి. వీటికి సంబంధించిన కొత్త వెర్షన్లు ఆండ్రాయిడ్ 13 త్వరలో విడుదలకానుండగా, ఐఓఎస్ 16 ఇప్పటికే యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు ఓఎస్‌లూ వేటికవే ప్రత్యేకమని ఆయా సంస్థలు చెబుతున్నా.. వీటిలో నాలుగు ఒకే విధమైన ఫీచర్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
కస్టమైజేషన్
కస్టమైజేషన్ అనగానే ఆండ్రాయిడ్‌లో ఉన్న ఆప్షన్లు ఐఓఎస్‌లో ఉండవు. కానీ, యాపిల్ కంపెనీ ఐఓఎస్ 14 నుంచి కస్టమైజేషన్‌లో కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తూ వస్తోంది. కొత్తగా రాబోతున్న ఐఓఎస్ 16లో హోమ్ స్క్రీన్‌తోపాటు లాక్‌స్క్రీన్‌లో కూడా యూజర్ తన నచ్చినట్లుగా మార్పులు చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13లో మెటీరియల్ యూ థీమ్‌తో గూగుల్ కూడా కస్టమైజేషన్ ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తోంది. దీంతో యాప్ ఐకాన్స్‌తోపాటు సిస్టమ్ కలర్ థీమ్‌ను కూడా యూజర్ తనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు.
లాంగ్వేజ్
సాధారణంగా ఫోన్‌లో ఉండే యాప్‌ల భాష ఆంగ్లంలోనే ఉంటుంది. కొన్ని యాప్‌లు మాత్రం ప్రాంతీయ భాషల్లో ఉంటాయి. అలాంటి వాటిని యూజర్లు తమకు అర్థమయ్యే భాషలో ఉపయోగించుకునేందుకు వీలుగా ఆండ్రాయిడ్ 13, ఐఓఎస్ 16లో యాప్ లాంగ్వేజ్‌ను మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్‌లో యాప్ ఐకాన్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే నచ్చిన భాషను ఎంచుకునే ఆప్షన్ కనిపిస్తుంది. ఐఓఎస్‌లో ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్ ఓపెన్ చేసి అందులో లాంగ్వేజ్ సెక్షన్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ కొన్ని యాప్‌లలో మాత్రమే పనిచేస్తుంది.
ఫోకస్ మోడ్
ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ ఫోకస్ మోడ్ ఉంది. రెండు ఓఎస్‌లలో ఇది వేర్వేరుగా పనిచేస్తుంది. ఐఓఎస్ ఫోకస్ మోడ్‌లో డు నాట్ డిస్ట్రబ్, డ్రైవింగ్, పర్సనల్, స్లీప్, వర్క్ వంటి ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. యూజర్ ఫోకస్ మోడ్ ఎనేబుల్ చేసి పైన పేర్కొన్న ఆప్షన్లలో ఒకటి ఎంచుకోవచ్చు.