Flipkart Republic Day Sale 2024 : ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్స్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తోంది. ఈ సేల్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 14, రెడ్మీ నోట్ 13ప్లస్ సహా, పలు స్మార్ట్ఫోన్లపై మంచి డీల్స్ అందిస్తోంది. వాటిలోని టాప్-5 డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
IPhone 15 Offers : ఐఫోన్ 15 అసలు ధర రూ.79,900 ఉంటుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ దీనిపై ఏకంగా 17 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అంటే ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 15ను మీరు కేవలం రూ.65,999కే దక్కించుకోవచ్చు. దీని వల్ల మీకు రూ.13,901 ఆదా అవుతుంది. అంతేకాదు ఈ ఐఫోన్ 15పై బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా లభిస్తాయి. కనుక దీనిని మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
IPhone 14 Offers : మార్కెట్లో ఐఫోన్ 14 ధర రూ.69,900 వరకు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ దీనిపై 17 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. పైగా దీనిపై బ్యాంక్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా లభిస్తాయి. వీటన్నింటినీ ఉపయోగించుకుంటే ఈ సేల్‌లో ఐఫోన్ 14ను కేవలం రూ.54,990లకే దక్కించుకోవచ్చు. ఇది బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు.
Redmi Note 13 Pro+ Offers : ఇటీవలే లాంఛ్ అయిన రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ (8జీబీ+256జీబీ) ధర రూ.31,999 వరకు ఉంటుంది. అయితే ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించి దీనిని కొంటే, ఫ్లిప్‌కార్ట్ నేరుగా రూ.2000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద అదనంగా మరో రూ.2000 తగ్గిస్తుంది. ఇది మంచి డీల్.