తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఫ్లిప్​కార్ట్​​ దీపావళి 'స్పెషల్'​ సేల్​- ఫీచర్​ ప్యాక్డ్​ స్మార్ట్​వాచ్​లపై అదిరిపోయే డీల్స్​! - అతి తక్కువ ధరకే స్మార్ట్​వాచ్​లు 2023

Flipkart Diwali Sale 2023 : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్.. దీపావళి సందర్భంగా ప్రత్యేక సేల్​ను ప్రారంభించింది. అందులో భాగంగా పలు స్మార్ట్​వాచ్​లపై మంచి డీల్స్​ను అందిస్తోంది. సరికొత్త ఫీచర్లున్న ఆ బడ్జెట్​ స్మార్ట్​వాచ్​ల వివరాలు మీ కోసం.

Flipkart Diwali Sale 2023
Flipkart Diwali Sale 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 3:35 PM IST

Updated : Nov 5, 2023, 4:57 PM IST

Flipkart Diwali Sale 2023 : ప్రముఖ ఈ కామర్స్​ సంస్థలు దీపావళి సందర్భంగా ప్రత్యేక సేల్​ను ప్రారంభించి భారీ ఆఫర్స్​, డీల్స్​ ప్రకటిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఈ కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ 'దీపావళి సేల్'​ను ప్రారంభించింది. బ్లూటూత్​ కాలింగ్​ ఫీచర్​ ఉన్న స్మార్ట్​ వాచ్​లపై అద్భుతమైన డీల్స్​ ప్రకటించింది. నవంబర్​ 11 వరకు ఉండే ఈ పండగ ప్రత్యేక సేల్​లో.. అందుబాటులో ధరల్లో హైటెక్ ఫీచర్లు ఉన్న స్మార్ట్​వాచ్​లపై లుక్కేద్దాం.

The BeatXP Vega : బీట్​ఎక్స్​పీ వెగా స్మార్ట్​వాచ్​ ప్రస్తుతం ఫ్లిప్​కార్ట్​ దీపావళి సేల్​ 2023లో భాగంగా రూ.1599కే లభిస్తోంది. ​1.43 అంగుళాల అమోలెడ్ డిస్​ప్లేతో వస్తోన్న ఈ వాచ్​లో బీటీ కాలింగ్ ఫీచర్ ఉంది. 1000 నిట్స్ బ్రైట్​నెస్​ ఫీచర్​ ఉంది. వీటితో పాటు ఐపీ68 వాటర్​ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్, హెల్త్​ మానిటరింగ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్​ కూడా ఈ వాచ్​లో పొందుపర్చారు.

BoAt Storm call : బోట్ స్ట్రోమ్ కాల్ స్మార్ట్​వాచ్​ 1.69 అంగులాల హెచ్​డీ డిస్​ప్లేతో వస్తోంది. ఇందులో ఐఫీ68 వాటర్​రెసిస్టెంట్ సర్టిఫికేషన్ కూడా ఉంది. బీటీ కాలింగ్, 550 నిట్స్ బ్రైట్​నెస్​, హెల్త్​ మానిటరింగ్ ఫీచర్లు ఉన్న ఈ వాచ్​.. ఫ్లిప్​కార్ట్​ దీపావళి సేల్​లో రూ.1799కే లభిస్తోంది.

బోట్ స్ట్రోమ్​కాల్ స్మార్ట్​వాచ్​

Noise Force Plus :నాయిస్ ఫోర్స్ ప్లస్ ఈ దీపావళి సేల్​ భాగంగా రూ.2199కే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్​వాచ్​లో 1.46 అంగులాల అమోలెడ్ డిస్​ప్లే ఉంది. బీటీ కాలింగ్, 120 స్ఫోర్ట్స్ మోడల్స్, హెల్త్ మానిటరింగ్ ఫీచర్స్ ఉన్నాయి.

The Fire-Boltt Commando : ఫైర్​ బోల్ట్​ కమాండో స్మార్ట్​ ప్రస్తుతం దీపావళి సేల్​లో రూ.1999కే లభిస్తోంది. ఈ స్మార్ట్​వాచ్​ 1.95 అంగులాల అమోలెడ్​ డిస్​ప్లేతో వస్తోంది. బీటి కాలింగ్, 120 స్ఫోర్ట్​ మోడల్స్, హెల్త్ మానిటరింగ్​ ఫీచర్స్ ఉన్నాయి. ఈ వాచ్​ను ఒక సారి ఫుల్​ ఛార్జింగ్ చేస్తే ఏడు రోజులు పాటు పనిచేస్తుంది.

ఫైర్ బోల్ట్ కమాండో స్మార్ట్​వాచ్

Noise Vision 3 :నాయిస్ విజన్ 3 ఫ్లిప్​కార్ట్​ ప్రత్యేక పండగ సేల్​లో రూ. 2799కే లభిస్తోంది. దీనిలో 1.96 అంగులాల అమోలెడ్ డిస్​ప్లే ఉంది. బీటీ కాలింగ్, హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. వాయిస్ కంట్రోల్ సపోర్ట్, గెశ్చర్ కంట్రోల్ వంటి ఫీచర్లు అదనం.

బడ్జెట్ స్మార్ట్​వాచ్​లు గురూ.. రూ.5వేల లోపు ఇవే బెస్ట్!

Top 5 Best Selling Smart Watches in Amazon Sale : తక్కువ ధరకే స్మార్ట్​వాచ్ కొందామనుకుంటున్నారా?.. అయితే అమెజాన్​ సేల్​లో వీటిపై ఓ లుక్కేయండి.!

Last Updated : Nov 5, 2023, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details