లగ్జరీ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. కొత్తగా తీసుకొచ్చిన ఐఓఎస్ 15లో (IOS 15 Features) మరిన్ని కీలక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాయిస్ మెమోస్ స్పీడ్ తగ్గించడం, కోరిన యాప్ ఫాంట్ సైజ్‌ను ఛేంజ్ చేసుకోవడం లాంటి ఫీచర్లను తీసుకొచ్చింది. అంతేగాక ఫోకస్ మోడ్, షేర్ ప్లే వంటి వాటిని యాపిల్ 6ఎస్ కంటే ముందు ఉన్న ఫోన్లలో ఈ సంస్థ అందిస్తుంది. వీటికి తాజాగా అద్భుతమైన ఐదు హిడెన్ ఫీచర్లును జోడించింది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యాప్ ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు..
యాపిల్ ఐఫోన్ (APPLE IPHONE) వినియోగదారులు కొత్తగా వచ్చిన ఐఓఎస్ 15తో కావాల్సిన యాప్‌ల ఫాంట్ సైజ్‌ను మార్చుకునే సదుపాయం ఉంటుంది. దీంతో యాప్‌లను సులువుగా గుర్తించవచ్చు. ఈ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఫోన్లకు వర్తిస్తుందని సంస్థ తెలిపింది. దీనిని మార్చుకునేందుకు ఓపెన్ కంట్రోల్ సెంటర్‌ను స్వైప్ చేయాలి. అక్కడ ఉన్న 'ఏఏ' బటన్‌ను నొక్కాలి. ఆపై ఎడమవైపుకు నొక్కుతూ పోతే ఫాంట్ సైజ్ మారుతుంది. తరువాత సెట్టింగ్స్‌ను సేవ్ చేయాలి.
లైవ్ టెక్ట్స్ కాపీ పేస్ట్..
ఐఓఎస్ 15లో యాపిల్ తీసుకువచ్చిన మరో కీలక ఫీచర్.. లైవ్ టెక్ట్స్ కాపీ, పేస్ట్. ఆండ్రాయిడ్‌లోని గూగుల్ లెన్స్ పనిచేసినట్లు యాపిల్‌లో ఈ ఫీచర్ పని చేస్తుంది. కెమెరా ఆన్ చేసి ఫొటో తీస్తుంటే.. అందులోని అక్షరాలు పైన కనిపిస్తుంటాయి. వాటిని మనం కావాలంటే కాపీ చేసుకోవచ్చు. అదే సమయంలో కోరిన చోట పేస్ట్ చేసుకోవచ్చు. ఓ వైపు ఫోన్ మాట్లాడుతూ కూడా ఇలా చేయవచ్చు. ఈ ఫీచర్‌ను పొందడానికి సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్.. ఆ తరువాత లాంగ్వేజ్ & రీజియన్ అండ్ ఎనేబుల్ లైవ్ టెక్ట్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఐఫోన్ ఎక్స్ఎస్ (APPLE IPHONE), ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఓఎస్ 15తో వచ్చే ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.
యాప్ యాక్టివిటీ రికార్డ్..