ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. కొచిన్‌కు వస్తున్న విమానం మస్కట్ విమానాశ్రయం రన్‌వే పై ఉండగా ఒక్కసారిగా రెండో ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ.. విమానాన్ని కమ్మేసింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు.. విమానాన్ని నిలిపేశారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలిసింది.
ప్రయాణికులు కొచిన్‌కు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ETV Bharat / science-and-technology
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మంటలు.. రన్‌వేపై ఉండగా... - ఎయిర్ఇండియా విమానంలో మంటలు
fire in air india flight
15:34 September 14
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మంటలు.. రన్‌వేపై ఉండగా...
Last Updated : Sep 14, 2022, 3:54 PM IST