తెలంగాణ

telangana

By

Published : Jun 19, 2021, 4:22 PM IST

ETV Bharat / science-and-technology

'సోనీ' బ్రావియా టీవీతో ఇంట్లోనే థియేటర్​ అనుభూతి!

జపాన్ దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ.. తన అత్యుత్తమ ఉత్పత్తి బ్రావియా స్మార్ట్ టీవీని ఆవిష్కరించింది. ఎక్స్‌ఆర్ ఏ 80జే ఓఎల్‌ఈడీ సిరీస్‌కు చెందిన ఈ సరికొత్త బ్రావియా ప్రారంభ ధరను రూ.2,99,990గా సోనీ ఇండియా నిర్ణయించింది.

Sony BRAVIA
సోనీ బ్రావియా

జపాన్​కు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ.. అత్యంత ఖరీదైన బ్రావియా స్మార్ట్ టీవీని భారత్​లో విడుదల చేసింది. హెచ్​డీఎంఐ 2.1 సపోర్ట్​పై పనిచేసే ఈ స్మార్ట్ టీవీ గేమ్స్ ఆడేవారికి అత్యంత అనువుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇంట్లోనే ఉంటూ థియేటర్​లో సినిమా చూస్తున్న అనుభూతి​ని ఆస్వాదించవచ్చని ప్రకటించిన సోనీ.. కాగ్నిటివ్ ప్రాసెసర్​ టెక్నాలజీతో రూపొందించినట్లు పేర్కొంది. 195, 164, 139సెం.మీ.లలో లభ్యం కానున్న సోనీ బ్రావియా.. ప్రారంభ ధర రూ.2,99,990

సోనీ బ్రావియా ఫీచర్​లు..

  • ఏ 80జే హెచ్​డీఆర్​
  • 4కే రిజల్యూషన్​
  • డాల్బీ విజన్
  • డాల్బీ సౌండ్​

"ఓఎల్​ఈడీ సిరీస్​లో అభివృద్ధి చేసిన ఎక్స్​ఆర్ కాగ్నిటివ్ ప్రాసెసర్ సాంప్రదాయ కృత్రిమ మేధను మించి.. మానవ మెదడులా ఆలోచించేలా రూపొందించాం. అత్యంత వాస్తవికమైన పిక్చర్ క్వాలిటీ, సౌండ్-ఫ్రమ్-పిక్చర్ రియాలిటీతో ఉత్తమమైన అనుభూతిని అందించనుంది."

-సోనీ ఇండియా

ఇది దేశంలోని అన్ని సోనీ కేంద్రాలతో పాటు.. ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ-కామర్స్ పోర్టల్‌లలో అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది.

ఇవీ చదవండి:సోనీ నుంచి అదిరిపోయే స్మార్ట్ టీవీలు- ధరలు ఇలా..

సోనీ నుంచి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. ఫీచర్లు ఇవే!

ABOUT THE AUTHOR

...view details