ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ బ్రావియా.. సరికొత్త స్మార్ట్ టీవీలను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 4కే అల్ట్రాహెచ్డీ ఎల్ఈడీ తెరతో ఎక్స్80జే(X80J) సిరీస్లో విడుదల చేసింది. ఇవి 43 నుంచి 75 అంగుళాల డిస్ప్లేతో వస్తున్నాయి. భారత్లో ఇప్పటివరకు 65 అంగుళాల టీవీనే అందుబాటులోకి తెచ్చిన సోనీ మిగతా వాటిని కూడా అతి త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది.
ఈ మోడల్లో రావాల్సిన వేరియంట్ల ధరలను సోనీ అధికారికంగా విడుదల చేయలేదు. 65 అంగుళాల మోడల్ సోనీ బ్రావియా కేడీ-65ఎక్స్80జే ధర సుమారు రూ. 1.3 లక్షలు ఉండొచ్చు అని సమాచారం. ఏప్రిల్ 9నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సోనీ సెంటర్లలో, ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్లలో ఇ-కామర్స్ పోర్టల్లలో అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది.