ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచేందుకు కొన్ని వివరాలు సమర్పించాలి. ఇందులో పేరు, వయసు, చిరునామా, మతం వంటి వాటితోపాటు అభిరుచులు, ఇష్టమైన ప్రాంతాలు, వంటకాలు, పుస్తకాలు, సినిమాలు అంటూ చాలా పెద్ద జాబితా ఉంటుంది. దీంతో ఫేస్‌బుక్ ఖాతా తెరిచేప్పుడు యూజర్లు వాటిని నింపేందుకు గంటలకొద్దీ సమయం వృథా అవడంతోపాటు, విసుగు తెప్పిస్తోందట. దీంతో కొన్ని కాలమ్స్‌ను తొలగించాలని ఫేస్‌బుక్ నిర్ణయించింది.
ETV Bharat / science-and-technology
ఇకపై యూజర్ ప్రొఫైల్‌లో ఆ వివరాలకు ఫేస్‌బుక్ గుడ్‌బై!
ఫేస్‌బుక్ ఖాతా నిబంధనలకు సంబంధించి మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాటి గురించి యూజర్లు తెలియజేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇంతకీ ఏంటా వివరాలు? ఎప్పట్నుంచి అమలు కానున్నాయో చూద్దాం.
facebook-to-remove-four-details-from-user-profile
ఇందులో భాగంగా యూజర్ ప్రొఫైల్‌లో మతపరమైన, రాజకీయపరమైన అభిప్రాయాలతోపాటు చిరునామా, జెండర్ వంటి వివరాలను ఇకపై తెలియజేయాల్సిన అవసరంలేదు. ఇప్పటికే ఈ వివరాలను సమర్పించిన యూజర్లకు ఫేస్‌బుక్ ప్రత్యేకంగా నోటిఫికేషన్లు పంపుతోంది. ఇకపై ఈ నాలుగు వివరాలు కనిపించవని, కొత్తగా ఖాతా తెరిచేవారు వీటి గురించి తెలియజేయాల్సిన అవసరంలేదని చెబుతోంది.