తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

170 దేశాల్లో ఇన్​స్టాగ్రామ్​ 'లైట్​'

ఫేస్​బుక్​ లైట్​ తరహాలో ఇన్​స్టాగ్రామ్​ లైట్​ అందుబాటులోకి వస్తోంది. 170 దేశాల్లో ఈ యాప్​ను విడుదల చేస్తున్నట్లు ఇన్​స్టా మాతృ సంస్థ ఫేస్​బుక్​ ప్రకటించింది.

facebook-rolled-out-instagram-lite-app-in-170-countries
170 దేశాల్లో ఇన్​స్టాగ్రామ్​ 'లైట్​' ప్రారంభించనున్న ఫేస్​బుక్​

By

Published : Mar 11, 2021, 6:27 PM IST

170 దేశాల్లో ఇన్​స్టాగ్రామ్​ లైట్​ను విడుదల చేస్తున్నట్లు మాతృసంస్థ అయిన ఫేస్​బుక్​ తెలిపింది. తక్కువ డేటాను ఉపయోగించి మంచి ఫొటో, వీడియో షేరింగ్ అనుభూతిని ఈ అప్లికేషన్​ ద్వారా పొందవచ్చిని పేర్కొంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, డేటా సమస్యలు ఎదుర్కొనే వారికి ఇది ఉపయోగంగా ఉంటుందని వివరించింది.

అయితే ఇన్‌స్టాగ్రామ్ లైట్ అప్లికేషన్​ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ఐఓఎస్​ వెర్షన్​ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. సాధారణ యాప్​లో ఒక వీడియో డౌన్​లోడ్​కు 30ఎంబీ అవసరమైతే.. కొత్త యాప్​తో కేవలం 2ఎంబీ సరిపోతుందని ఫేస్​బుక్​ వెల్లడించింది.

ఫేస్​బుక్​ లైట్​ను అభివృద్ధి చేసిన వారే ఈ యాప్​ను కూడా రూపొందించడంలో భాగమయ్యారు.

  • ఇన్​స్టా లైట్​ యాప్​తో వీడియో రీల్స్ చేయవచ్చు.
  • ఇన్​స్టా లైట్​ పనితీరు మరింత విశ్వసనీయంగా ఉంచడానికి ఏఆర్​ ఫిల్టర్లు, డేటా రిచ్ యానిమేషన్​ వంటి వాటిని తొలిగించింది.
  • తక్కువ డేటాతో ఎక్కువ ఆనందం పొందేలా స్టిక్కర్లను, జిఫ్​లను యాప్​లో ఉంచింది.
  • కొత్త వినియోగదారులకు అర్థంకాని కొన్ని ఐకాన్​లను తీసివేసింది.
  • వాస్తవానికి ఇన్​స్టాగ్రామ్​ లైట్​ 2018లోనే అందుబాటులోకి వచ్చినా.. తరువాత కాలంలో ప్లే స్టోర్​ నుంచి తొలగించారు.
  • భారత్​లో కొత్త ఇన్​స్టా యాప్​ సేవలు 2020 డిసెంబర్​ నుంచే అందుబాటులో ఉంచారు.

ఇదీ చూడండి: 'ఇన్​స్టా'లానే వాట్సాప్​లోనూ 'బూమరాంగ్' ఫీచర్​

ABOUT THE AUTHOR

...view details