తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Facebook Multiple Profile Feature : ఫేస్​బుక్ మల్టిపుల్ ప్రొఫైల్ ఫీచర్​తో​.. ఒకేసారి సొంత పని, ఆఫీస్​ పని చేసుకునే ఛాన్స్​! - facebook payments

Facebook Multiple Profile Feature In Telugu : ఫేస్​బుక్​ మల్టిపుల్​ ప్రొఫైల్​ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీ మెయిన్​ ప్రొఫైల్​కు అదనంగా.. నచ్చినన్ని వేరే ప్రొఫైల్స్​ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు ఒకే సమయంలో మీ ప్రొఫెషనల్​ వర్క్​, పర్సనల్ వర్క్ రెండూ చేసుకోవడానికి వీలవుతుంది. పూర్తి వివరాలు మీ కోసం..

Facebook new feature
Facebook Multiple profile feature

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 5:25 PM IST

Facebook Multiple Profile Feature :ఫేస్​బుక్ యూజర్లకు గుడ్​ న్యూస్​. ఇప్పుడు మీరు నేరుగా మల్టిపుల్​ ఫేస్​బుక్ ప్రొఫైల్స్​ క్రియేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీ ప్రెజెంట్​ అకౌంట్​ నుంచి లాగ్అవుట్​ కాకుండానే.. మిగతా ప్రొఫైల్స్​ అన్నింటినీ యాక్సెస్ చేసుకోవచ్చు. దీని వల్ల మీ ప్రొఫెషనల్ అకౌంట్​ను, ఫ్రెండ్స్​తో చాట్​ చేసే వేరే అకౌంట్​ను ఏక కాలంలో ఉపయోగించుకునేందుకు వీలవుతుంది.

ఉదాహరణకు, మీకు రెండు ఫేస్​బుక్​ ప్రొఫైల్స్​ ఉన్నాయని అనుకుందాం. అప్పుడు మీరు ఒకే సమయంలో.. ఒక ప్రొఫైల్​లో ఆఫీస్ వర్క్​​ చేస్తూ.. మరో దానిలో స్నేహితులు, సన్నిహితులతో చాట్ చేస్తూ ఉండవచ్చు.

యూజర్ బేస్ పెంచుకునేందుకు!
మెటా కంపెనీ ఇప్పటికే ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్​లో మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. తాజాగా ఫేస్​బుక్​లోనూ ఈ ఫెసిలిటీని తీసుకువచ్చింది. దీని ద్వారా ఫేస్​బుక్ యూజర్లు తమ ప్రొఫెషనల్​, పర్సనల్ వర్క్స్​ రెండూ ఒకే సమయంలో చేయడానికి వీలవుతుంది. దీని ద్వారా ఫేస్​బుక్​కు కూడా యాజర్ బేస్​ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఎన్ని ప్రొఫైల్స్ క్రియేట్ చేయవచ్చు!
ప్రస్తుతం ఫేస్​బుక్​.. ఈ నయా ఫీచర్​ను ఒక క్రమపద్ధతిలో ప్రపంచమంతా రోల్​అవుట్​ చేస్తోంది. కనుక ప్రస్తుతం కొంత మంది యూజర్లకు మాత్రమే ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే మరికొద్ది రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే కనుక అందుబాటులోకి వస్తే.. యూజర్లు తమకు నచ్చినన్ని ప్రొఫైల్స్​ క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు.

ఫేస్​బుక్​ మల్టిపుల్ ప్రొఫైల్స్​ను ఎలా క్రియేట్ చేసుకోవాలి?
How To Create Multiple Facebook Profiles :మీకు ఒక మెయిన్​ ఫేస్​బుక్​ ప్రొఫైల్ ఉంటే.. దానికి అదనంగా మీకు నచ్చినన్ని ప్రొఫైల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మల్టిపుల్ ప్రొఫైల్స్​​ను ఎలా క్రియేట్​ చేసుకోవాలో చూద్దాం.

  1. ముందుగా మీ ఫేస్​బుక్​ అకౌంట్​లోకి లాగిన్ కావాలి.
  2. ఫేస్​బుక్​ ప్రొఫైల్​ నేమ్​పై క్లిక్ చేయాలి.
  3. Create Another Profileపై ట్యాప్​ చేయాలి.
  4. మీకు నచ్చిన యూజర్ నేమ్​, ప్రొఫైల్​ ఫొటోను అప్​లోడ్​ చేయాలి.
  5. మీ ఇతర అకౌంట్స్​లోని స్నేహితులను, గ్రూప్స్​ను ఇందులో యాడ్ చేసుకోవాలి.
  6. ప్రొఫైల్​ ఐకాన్​పై ట్యాప్​ చేయాలి. అంతే మీ సరికొత్త ఫేస్​బుక్​ ప్రొఫైల్ యాక్టివేట్ అయిపోతుంది.

వీటికి వర్తించదు!
ఫేస్​బుక్ తీసుకువచ్చిన​ ఈ నయా ఫీచర్​.. కొన్నింటిలో పనిచేయదు. ముఖ్యంగా ఫేస్​బుక్​ డేటింగ్​, మార్కెట్​ప్లేస్​, ప్రొఫెషనల్ మోడ్​, పేమెంట్స్​ లాంటి వాటికి.. తాజా మల్టిపుల్ ప్రొఫైల్​ ఫీచర్​ సపోర్ట్ చేయదు. అయితే ఈ మల్టిపుల్ ప్రొఫైల్ ఫీచర్​.. ఫేస్​బుక్​ యాప్​, వెబ్​ వెర్షన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. త్వరలో మెసెంజర్​ యాప్​లో కూడా ఈ మల్టిపుల్​ ప్రొఫైల్​ ఫీచర్​ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details