తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఆటోమెటిక్​గా ఫ్రెండ్ రిక్వెస్ట్.. ఫేస్​బుక్​లో కొత్త బగ్!

Facebook friend request bug : ఫేస్​బుక్​లో తెలిసినవారి అకౌంటే కదా అని ఓపెన్ చేస్తే మీకు షాక్ తప్పదు.. ఎందుకంటే మీరు ఓపెన్ చేసిన ఆ ఖాతాలకు ఆటోమెటిక్​గా ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్లిపోతోంది. ఈ సమస్యపై ఫేస్​బుక్ స్పందించింది.

facebook friend request bug
facebook-bug

By

Published : May 16, 2023, 11:38 AM IST

Facebook Friend Request Bug : సోషల్​ నెట్​వర్కింగ్ యాప్ ఫేస్​బుక్​లో మరో సెక్యూరిటీ లోపం తలెత్తింది. యూజర్లు ఏదైనా ప్రొఫైల్​ను ఓపెన్ చేస్తే వారికి ఆటోమెటిక్​గా ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్లిపోతోంది. ఈ లోపాన్ని స్వయంగా గుర్తించిన ఫేస్​బుక్.. దీనిపై వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది. ఇటీవలి అప్​డేట్​లో ఈ లోపం ఏర్పడినట్లు తెలిపింది.

ఈ సమస్య గతవారం వెలుగులోకి వచ్చింది. యూజర్లు ఓపెన్ చేసిన ప్రతి ప్రొఫైల్​కు ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్లిపోయింది. దీనిపై అనేక మంది సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు. తమ అనుమతి లేకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్​లు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మెటా వెంటనే స్పందించింది. సమస్యను గుర్తించి.. చర్యలు చేపట్టింది. యాప్ అప్​డేట్ తర్వాత ఈ సెక్యూరిటీ లోపం తలెత్తినట్లు వెల్లడించింది. సమస్యను పరిష్కరించినట్లు స్పష్టం చేసింది.

"ఇటీవలి యాప్ అప్​డేట్​లో బగ్ గుర్తించాం. దీని వల్ల పొరపాటున ఫ్రెండ్ రిక్వెస్ట్​లు వెళ్లాయి. దీంతో కొంతమంది యూజర్లకు ఇబ్బందులు తలెత్తాయి. అందుకు క్షమాపణల కోరుతున్నాం. ఈ బగ్​ను సరిచేశాం."
-మెటా ప్రతినిధి

మరోవైపు, ఫేస్​బుక్​ను ఉపయోగించి పలువురు స్కామ్​లకు పాల్పడుతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకొని సైబర్ దాడులు చేస్తున్నారు. ఫేస్​బుక్ పేజీల ద్వారా యూజర్ల సిస్టమ్​లలోకి మాల్​వేర్​ను వ్యాప్తి చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఈ స్కామ్ బయటపడింది. నకిలీ చాట్​జీపీటీ పేజీలను సృష్టించి.. వాటిని మాల్​వేర్ వ్యాప్తి చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు క్లౌడ్ ఎస్ఈకే అనే రీసెర్చ్ టీమ్ గుర్తించింది. యూజర్ నేమ్​లను సైతం మార్చేసి నెటిజన్లను ఏమార్చుతున్నారని వెల్లడించింది. అనంతరం, ఫేస్​బుక్​ పేజీలలో యాడ్స్ ప్లే చేస్తున్నారు. లేటెస్ట్ 'చాట్​జీపీటీ వెర్షన్', 'జీపీటీ-వీ4' పేర్లతో లింకులు ఏర్పాటు చేస్తున్నారు. యూజర్ల ఆ లింక్​లపై క్లిక్ చేస్తే.. సిస్టమ్​లలోకి మాల్​వేర్​ చొరబడుతోంది. ఇది యూజర్ల సెక్యూరిటీకి భంగం కలిగిస్తోందని క్లౌడ్ ఎస్ఈకే తెలిపింది.

మే నెల మొదట్లో మెసేంజర్​లోనూ సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఆటోమెటిక్​గా ఫొటోలు డిలీట్ అయ్యాయి. గ్రూప్ చాట్లు, డైరెక్ట్ మెసేజ్​లలో పంపించుకునే ఫైళ్లు, లింకులు సైతం వాటికవే డిలీట్ అయిపోయాయి. మెసేంజర్​ హిస్టరీ సైతం డిలీట్ అయిపోయింది. తమ ఖాతాలు ఓపెన్ చేసేందుకూ కొందరు ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా ఫిలిప్పీన్స్​లో ఉండేవారికి ఈ సమస్య అధికంగా కనిపించింది. బ్రెజిల్​లోని కొందరు యూజర్లకు సైతం ఈ ఇబ్బంది ఎదురైంది.

ABOUT THE AUTHOR

...view details