ఏమిటీ శబ్దం?
ధ్వని వేగం గంటకు 1,225 కిలోమీటర్లు. అంతకన్నా వేగంగా దూసుకెళ్లడాన్ని సూపర్‌సోనిక్ వేగంగా పేర్కొంటారు. అయితే ఆకాశంలో ఇంత స్పీడుగా లోహవిహంగం వెళుతుంటే.. దానికింద నేలపై విస్ఫోటం తరహాలో కర్ణ కఠోరమైన ధ్వని(సోనిక్ బూమ్) వెలువడుతుంది. ఆ ప్రాంతంలోని వారికి అది అసౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల భవనాల్లో కిటికీల అద్దాలు పగిలిపోవచ్చు.
నేడు సూపర్‌సోనిక్ ప్రయాణికుల విమానాలేమీ లేకుండా పోవడానికి ఈ సోనిక్ బూమ్ కూడా ఒక కారణం. కంకార్డ్ పేరిట ఈ తరహా విమానాలు గతంలో గగనవిహారం చేశాయి. సోనిక్ బూమ్, ఇతర ఇబ్బందుల వల్ల 2003లో ఈ విమాన సర్వీసుకు ముగింపు పలకాల్సి వచ్చింది. నేల, తీర ప్రాంతాలకు ఎగువన ప్రయాణించేటప్పుడు సూపర్‌సోనిక్ వేగంతో విమానాలను నడపరాదని అంతర్జాతీయ నిబంధనలు స్పష్టంచేస్తున్నాయి.
సోనిక్ బూమ్ ఎలా ఏర్పడుతుంది?
విమానం గాల్లో ప్రయాణించేటప్పుడు ధ్వని తరంగాలు వెలువడుతుంటాయి. ధ్వని కన్నా తక్కువ వేగం (సబ్‌సోనిక్)తో జెట్ ప్రయాణిస్తున్నప్పుడు ఆ తరంగాలు నలు దిశల్లోకి పయనిస్తాయి. సూపర్‌సోనిక్ వేగంతో దూసుకెళ్లేటప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. స్వీయ ధ్వని కన్నా ఆ విమానం ముందుంటుంది. ఈ క్రమంలో ధ్వని తరంగాలు సంపీడనానికి లోనై, ఒకే ప్రకంపన తరంగంగా రూపాంతరం చెందుతాయి. ఆ తరంగం విమాన ముక్కు భాగం వద్ద మొదలై, తోక భాగం వరకు విస్తరిస్తుంది. ఇది ఒక శంఖం ఆకృతిలో ఉంటుంది. అది విమానం నుంచి నేల వరకు వ్యాప్తి చెందుతుంది. ప్రజల చెవులను ఈ ప్రకంపన తాకినప్పుడు సోనిక్ బూమ్ వినిపిస్తుంది. విమానం మనల్ని దాటి వెళ్లాక ఆ ధ్వని మన చెవిన పడుతుంది.
ప్రత్యేక డిజైన్‌తో చెక్
NASA supersonic X 59 : ఈ ప్రకంపన తరంగాలు ఒక్కటిగా కలవకుండా ఎక్స్-59 డిజైన్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ముందువైపున ఉండే మొన భాగం చాలా విభిన్నంగా ఉంటుంది. విమానం పొడవులో ఇది మూడో వంతును ఆక్రమించింది.
- ఎక్స్-59లో వ్యూహాత్మకంగా తీర్చిదిద్దిన ఏరోడైనమిక్ ఉపరితలాలు ప్రకంపన తరంగాలను నలు దిశలకూ వెదజల్లుతాయి.
- విమానం ఇంజిన్‌ను దిగువ భాగంలో కాకుండా పైభాగంలో అమర్చారు. దీనివల్ల లోహవిహంగ దిగువ భాగం మృదువుగా ఉంటుంది. అందువల్ల బలమైన ప్రకంపన తరంగాలు నేల వరకు చేరవు.
- ఎక్స్-59 వల్ల 75 డెసిబుల్స్ తీవ్రతతో ధ్వని వెలువడుతుందని నాసా భావిస్తోంది. కంకార్డ్ విమానం 105 డెసిబుల్స్ ధ్వనిని కలిగించింది.
- కొత్తతరం విమానాలకు బాటలు