కమాండ్ కంట్రోల్స్ ఉపయోగించకుండా కేవలం ఆలోచనలతో యంత్రాలను నడిపించగల టెక్నాలజీపై చేస్తోన్న పరిశోధనల్లో ముందడుగు పడింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీకి చెందిన పరిశోధకులు.. ఓ కోతికి కొద్దిరోజుల ముందు చిప్‌ను అమర్చారు. పక్కన ఉండే వ్యక్తి జాయ్ స్టిక్‌తో వీడియో గేమ్ ఆడుతుండగా.. అన్నీ గమనించిన ఆ కోతి.. కొద్ది వారాల తరువాత ఎటువంటి పరికరం లేకుండా తన సొంత ఆలోచనలతో గేమ్‌ను కంట్రోల్ చేసింది. కోతి ఇలా చేయడం గమనించిన పక్కన ఉన్న వ్యక్తి వీడియో తీశారు.
ఎటువంటి కమాండ్ కంట్రోల్స్ లేకుండా ఇలా జరగడం అసాధారణం. కానీ ఈ లైవ్ వీడియో చూసిన తరువాత కోతికి చిప్ ఇన్‌ప్లాంట్ చేస్తే వీడియో గేమ్స్ ఆడగలదని అందరు నమ్ముతున్నారు. అయితే ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. పక్షవాతానికి గురైన వ్యక్తి బీర్ తాగడానికి న్యూరాలింక్ సాయంతో రోబోటిక్ చేతిని ఉపయోగిస్తున్నారు.