తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Elon Musk Tesla Phone : ఈ సూపర్​ 'టెస్లా ఫోన్​'తో.. మార్స్​ నుంచి కూడా మాట్లాడవచ్చు! - ఐఫోన్ వర్సెస్​ టెస్లా ఫోన్​

Elon Musk Tesla Phone Latest News : అపర కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ మరోసారి సంచలన ప్రకటన చేశారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్​లో టెస్లా ఫోన్​ ఫొటోను షేర్​ చేసి, దీనితో ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా మాట్లాడవచ్చని పేర్కొన్నారు. బహుశా మార్స్ (అంగారక గ్రహం) నుంచి కూడా మాట్లాడవచ్చని చమత్కరించారు.

Tesla Phone latest news
Elon Musk Tesla Phone

By

Published : Aug 2, 2023, 1:25 PM IST

Elon Musk Tesla Phone News : టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ మరోసారి సంచలన వార్తను తీసుకొచ్చారు. తన ట్విట్టర్ అకౌంట్​లో 'టెస్లా ఫోన్'​ ఫొటోను షేర్​ చేసిన ఆయన.. ఈ ఫోన్​తో మార్స్​ నుంచి కూడా మాట్లాడవచ్చని పేర్కొన్నారు.

టెస్లా ఫోన్​ కావాలా?
Tesla phone latest pictures : ఎలాన్​ మస్క్​ తన ట్విట్టర్ అకౌంట్​లో టెస్లా ఫోన్​ను చూపిస్తూ.. దీనిని మీరూ వాడాలని అనుకుంటున్నారా? అని తన ఫాలోవర్స్​ను అడిగారు. దీనితో నెటిజన్ల నుంచి ఆయన ట్వీట్​కు భారీ స్పందన వచ్చింది.

స్టార్​లింక్​తో కనెక్ట్ చేస్తాం!
Tesla phone Starlink connectivity : క్రిప్టో ఇన్ఫినిటీ అనే ట్విట్టర్​ యూజర్​ ఈ శాటిలైట్​ ఫోన్​ను​.. స్టార్​లింక్​తో కనెక్ట్ చేస్తారా? అని ప్రశ్నించాడు. ఎలాన్​ మస్క్ దీనికి సమాధానంగా ​టెస్లా ఫోన్​ను స్టార్​లింక్​తో కనెక్ట్ చేసే అవకాశం ఉందని తెలియజేశారు.

ఫ్రీ స్పీచ్​ సాధ్యమేనా!
Tesla phone free speech server : ఓడర్ వాట్​ అనే మరో ట్విట్టర్​ యూజర్​.. ఫ్రీ స్పీచ్​ సర్వర్స్​తో టెస్లా ఫోన్​ వస్తుందా? అని ప్రశ్నించారు.

xOSతో పనిచేస్తుందా?
Tesla new phone OS : హబీబీ అనే మరో ట్విట్టర్ యూజర్​.. టెస్లా ఫోన్​ xOSతో పనిచేస్తుందా? అని ఎలాన్​ మస్క్​ను ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా.. తను 1000 శాతం టెస్లా ఫోన్​ను లైక్​ చేస్తున్నానని.. అది xOSతో పనిచేస్తే మరింత సంతోషిస్తానని పేర్కొన్నాడు.

టెస్లా ఫోన్​ సైజ్​.. వెయిట్​?
Tesla phone size and weight : రేయాన్​ అనే మరో యూజర్​.. టెస్లా ఫోన్​ సైజు, వెయిట్​ ఎంత ఉండొచ్చని మస్క్​ను ప్రశ్నించారు. అంతే కాకుండా ఈ ఫోన్​ ఐఫోన్​ 12 మినీ సైజులో ఉంటే.. దానిని ఉపయోగించేందుకు తాను ఎంతో ఆసక్తి చూపిస్తానని కూడా అన్నాడు.

ఐఫోన్​ కంటే బెటర్​గా ఉంటుది!
Tesla phone vs iPhone : రేయాన్​ను సమాధానం ఇస్తూ, ఐఫోన్ కంటే.. టెస్లా ఫోన్​ చాలా బెటర్​గా ఉంటుందని ఎలాన్​ మస్క్​ పేర్కొన్నారు.

మార్స్ నుంచి కూడా మాట్లాడవచ్చు!
Tesla phone can used from Mars : టెస్లా ఫోన్​కు స్టార్​లింక్​ కనెక్టివిటీ ఉంటుందా? అని ప్రశ్నించిన ఓ యూజర్​కు మస్క్​ సమాధానం ఇచ్చారు.

"నెలకు 100 డాలర్లు చెల్లించి, ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా టెస్లా ఫోన్​తో మాట్లాడవచ్చు. బహుశా మీరు మార్స్ (అంగారక గ్రహం)​ నుంచి కూడా దీనిని ఉపయోగించవచ్చు."
- ఎలాన్​ మస్క్​, టెస్లా సీఈఓ

వైరల్​ మస్క్​!
Elon Musk latest viral tweet : ఎలాన్​ మస్క్​ చేసిన ఈ ట్వీట్​ ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు దాదాపు 5 మిలియన్ల వ్యూస్​ దీనికి వచ్చాయి. అలాగే 85.7k లైక్స్​, 6,395 రీట్వీట్స్ కూడా ఉన్నాయి.

'ఎలాన్​ మస్క్​ తన టెస్లా ఫోన్​ న్యూ లుక్​ చూపించి, ప్రజల చూపును తన వైపు తిప్పుకున్నారు. అలాగే టెస్లా బ్రాండ్​పై ప్రజల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించారని అనడంలో ఎలాంటి సందేహం లేదని' టెక్ నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details