లగ్జరీ కార్ల సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్లో చురుగ్గా ఉంటూ.. ఎప్పటికప్పడు తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఈ మేరకు జనాభా విస్ఫోనంపై 'టెస్లా ఓనర్స్ ఆఫ్ ద ఈస్ట్ బే' అనే ఫ్యాన్ క్లబ్ చేసిన ఆసక్తికర ట్వీట్‌కు బదులిచ్చారు. 'జనాభా విస్ఫోటం ప్రభావం మనపై పడొచ్చు. కానీ దీనిని అరికట్టేందుకు మీరు(మస్క్) గట్టి ప్రయత్నాలు చేస్తున్నందుకు అభినందిస్తున్నాం' అంటూ ఆ ఫ్యాన్ క్లబ్ రాసుకొచ్చింది.
దానికి బదులుగా.. అంగారక గ్రహానికి వెళదాం అంటూ ట్వీట్ చేశారు మస్క్.
"అంగారక గ్రహానికి మానవుల అవసరం చాలా ఉంది. భూమిపై తమతో పాటు ఇతర జీవులను సంరక్షించుకునేందుకు మనిషి ఉన్నాడు. కాబట్టి అంగారక గ్రహానికి వెళదాం."
--ట్విట్టర్లో ఎలాన్ మస్క్
2050-2100 మధ్యలో సంతానోత్పత్తి రేటు తీవ్రం కానుందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ నివేదిక-2020 పేర్కొంది. ఈ అధ్యయనం ప్రముఖ సైన్స్ జర్నల్ 'ది లాన్సెట్'లోనూ ప్రచురితమైంది.