తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

యాప్స్​ ట్రాకింగ్​కు చెక్​ పెట్టే 'డక్​ డక్​ గో' టూల్​ - యాప్ ట్రాకింగ్ టూల్స్​

డక్‌ డక్‌ గో సెర్చ్ ఇంజిన్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. థర్డ్‌ పార్టీ యాప్స్‌ మీ డేటాను ట్రాక్‌ చేయకుండా ఇది అడ్డుకుంటుంది. త్వరలోనే ఆండ్రాయిడ్​ యూజర్స్‌ అందరికీ అందుబాటులోకి రానుంది.

duckduckgo-tool
యాప్స్​ ట్రాకింగ్​కు చెక్​ పెట్టే 'డక్​ డక్​ గో' టూల్​

By

Published : Nov 26, 2021, 5:42 PM IST

ఆండ్రాయిడ్‌ యూజర్స్‌ (Android Users) డేటా ప్రైవసీని దృష్టిలో ఉంచుకొని డక్‌ డక్‌ గో సెర్చ్ ఇంజిన్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌ ట్రాక్‌ ప్రొటెక్షన్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ టూల్‌ థర్డ్‌ పార్టీ యాప్స్‌ మీ డేటాను ట్రాక్‌ చేయకుండా అడ్డుకుంటుంది. ప్రస్తుతం ఈ టూల్ బీటా యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్స్‌ అందరికీ అందుబాటులోకి రానుంది.

యాప్స్​ ట్రాకింగ్​కు చెక్​ పెట్టే 'డక్​ డక్​ గో' టూల్​

ఎలా పనిచేస్తుందంటే..

మన స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించే వివిధ రకాల యాప్స్‌ వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతమున్న సాంకేతిక ప్రపంచంలో వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంకింగ్‌ వివరాల వరకు ప్రతిదీ డిజిటలైజ్ చేస్తుండటంతో యూజర్ డేటానే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దీన్ని నివారించేందుకు డక్‌ డక్‌ గో.. దాని బ్రౌజర్‌లోనే యాప్‌ ట్రాక్‌ ప్రొటెక్షన్‌ను తీసుకొచ్చింది. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేయగానే.. బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేయడం మొదలెట్టేస్తుంది. మీ ఫోన్‌లోని యాప్స్‌ ఏవైనా మీ డేటాను థర్డ్‌ పార్టీ ట్రాకర్స్‌కు పంపుతుంటే.. వెంటనే ఆ యాప్‌ మీ సమాచారాన్ని సేకరించకుండా నిలిపివేస్తుంది. ఆ టూల్‌లో ఇప్పటివరకు బ్లాక్ చేసిన ట్రాకర్స్‌ జాబితా, మీ సమాచారం ఎక్కడికి వెళ్తుందో కూడా తెలుసుకోవచ్చు.

యాప్స్​ ట్రాకింగ్​కు చెక్​ పెట్టే 'డక్​ డక్​ గో' టూల్​

87% గూగుల్‌కు.. 68% ఫేస్‌బుక్‌కు

డక్‌ డక్‌ గో సంస్థ ఇంటర్నెల్‌గా ఈ టూల్‌ను పరీక్షించినప్పుడు.. బాగా మంచి రేటింగ్ ఉన్న 96% ఫ్రీ యాప్స్‌.. ఆండ్రాయిడ్‌ యూజర్ల వ్యక్తిగత డేటాను థర్డ్‌ పార్టీ ట్రాకర్స్‌కు అందిస్తున్నట్లు కనుగొన్నారు. అంతేగాక ఈ యాప్‌లలో 87 శాతం యూజర్‌ల డేటాను గూగుల్‌కు పంపుతుండగా, 68 శాతం డేటా ఫేస్‌బుక్‌కు పంపుతున్నాయని కంపెనీ పరిశీలనలో తేలింది.

ఇదీ చదవండి:ఆండ్రాయిడ్ ఫోన్‌ వాడుతున్నారా.. మరి ఈ మార్పులు చేశారా?

ABOUT THE AUTHOR

...view details