Discounts on Iphone 12 mini: ఐఫోన్ కొనాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. కానీ వాటి ధరలు చూస్తే గుండెల్లో గుబులే! డిస్కౌంట్లో మంచి ఆఫర్ వస్తే ఐఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇప్పుడు ఐఫోన్ 12 మినీ.. రూ. 50వేల లోపే దక్కనుంది. రిలయన్స్ డిజిటల్ ఇటీవలే ఈ ఆఫర్‌ను ప్రకటించింది.
సాధారణంగా.. మార్కెట్లో 64జీబీ ఐఫోన్ మినీ ధర రూ. 59,900గా ఉంది. రిలయన్స్ డిజిటల్ ఇచ్చిన ఆఫర్‌తో ఆ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 49,900కే కొనుగోలు చేయవచ్చు. రూ. 10,000 క్యాష్‌బ్యాక్‌తో పాటు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేని ఈఎమ్ఐ ఆఫర్ కూడా అందిస్తోంది రిలయన్స్ డిజిటల్. వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉన్న వారికి అదనంగా 10శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఫోన్‌పై ఏడాది కాలం పాటు వారంటీ కూడా అందిస్తోంది.