తెలంగాణ

telangana

By

Published : Jun 19, 2023, 4:25 PM IST

ETV Bharat / science-and-technology

Content Creators Gadgets : ఈ 10 వస్తువులు ఉంటే సూపర్ కంటెంట్ మీదే!

Content Creators Gadgets : మీరు కంటెంట్ క్రియేటర్​ అవుదామని అనుకుంటున్నారా? సోషల్​ మీడియాలో పాపులర్​ అవుదామని కలలు కంటున్నారా? అయితే 10 ముఖ్యమైన గాడ్జెట్స్​ మీ దగ్గర కచ్చితంగా ఉండాల్సిందే. అవేంటో చూద్దాం రండి.

Content Creators Gadgets
essential gadgets for every content creators

Content Creators Gadgets : సోషల్​ మీడియా మానియా నడుస్తున్న నేటి కాలంలో కంటెంట్ క్రియేటర్లకు మంచి డిమాండ్​ ఉంది. అయితే మంచి కంటెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. దానిని ప్రెజెంట్ చేసే విధానం కూడా చాలా బాగుండాలి. దాని కోసం సరైన ఎక్విప్​మెంట్​ కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఓ లుక్కేద్దామా..

కెమెరా
విజువల్​ కంటెంట్​ హవా నడుస్తున్న ఈ సమయంలో.. కంటెంట్​ క్రియేటర్స్​ దగ్గర తప్పకుండా ఉండాల్సిన మొదటి గాడ్జెట్​ కెమెరా. మార్కెట్​లో చాలా మంచి కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. మంచి ఫుటేజ్​ కోసం సాధారణంగా డీఎస్​ఎల్​ఆర్​ లేదా మిర్రర్​లెస్​ కెమెరాలు వాడుతుంటారు. కానీ వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది.

క్వాలిటీ వీడియోలు, ఫోటోలు తీయడం కోసం డీఎస్​ఎల్​ఆర్​

ఒక వేళ మీరు స్టార్టర్​ అయినా మీ దగ్గర అంత బడ్జెట్​ లేకపోయినా మరేం ఫర్వాలేదు. ఇప్పుడు వస్తున్న స్మార్ట్​ఫోనుల్లో కూడా చాలా మంచి వీడియో క్వాలిటీ ఉంటోంది. 4కే వీడియోలు, హెచ్​డీ ఇమేజ్​లు కూడా తీసుకునే సౌలభ్యం కలుగుతోంది. హై బడ్జెట్​ నుంచి లోబడ్జెట్​ మొబైల్స్​లోనూ మంచి కెమెరాలు ఉంటున్నాయి. కనుక వీటిని కూడా ట్రై చేయవచ్చు.

ట్రైపాడ్​, గింబల్స్
మీరు తీసే ఫొటోలు, వీడియోలు చాలా మంచిగా, స్టేబుల్​గా రావాలంటే కచ్చితంగా ట్రైపాడ్​ వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా టైమ్​ లాప్స్​, సెల్ఫ్​ రికార్డింగ్​ చేసేటప్పుడు వీటి అవసరం ఎంతో ఉంటుంది.

గింబల్​ - ట్రైపాడ్​

డ్రోన్స్​
ఒక వేళ మీ దగ్గర కాస్త బడ్జెట్​ ఎక్కువగా ఉంటే.. గింబల్స్​తో పాటు డ్రోన్స్​ కూడా వాడొచ్చు. గింబల్​ వల్ల మీ వీడియో స్టెబిలిటీ బాగుంటుంది. ఇప్పుడు స్మార్ట్​ఫోన్లకు, డీఎస్​ఎల్​ఆర్​లకు.. రెండింటికీ ఉపయోగించుకునే గింబల్స్​కు మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక టాప్​ యాంగిల్​ షాట్స్​​ తీయాలంటే డ్రోన్స్ వాడాల్సి ఉంటుంది. అయితే ఇవి ఎక్కడపడితే, అక్కడ వాడడానికి వీలుపడదు. పోలీసుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి.

ఎత్తు నుంచి వీడియోలు షూట్​ చేయడం కోసం డ్రోన్​ కెమెరా

మైక్రో ఫోన్​
మంచి ఆడియో క్వాలిటీ కావాలంటే కచ్చితంగా బెస్ట్​ మైక్రోఫోన్​ వాడాల్సి ఉంటుంది. షాట్​గన్​ మైక్​, లావాలియర్​ మైక్​ లాంటి ఎక్స్​టర్నల్​ మైక్రోఫోన్స్​ వాడడం వల్ల మంచి ఆడియోను రికార్డ్ చేయడానికి వీలవుతుంది. ఒక వేళ మీ బడ్జెట్​ తక్కువగా ఉన్న ఫర్వాలేదు. తాజాగా నాయిస్​ కాన్సిలేషన్​ ఫీచర్​తో ఎన్నో మంచి ఇయర్​ ఫోన్స్ మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ట్రై చేయండి.

మంచి క్వాలీటీ ఆడియో రికార్డింగ్​ కోసం మైక్రోఫోన్​

లైటింగ్​ కిట్​
వీడియోలు, ఫొటోలు మంచి క్వాలిటీగా తీయాలంటే.. లైటింగ్ అనేది​ చాలా ముఖ్యం. ఇందుకోసం మార్కెట్​లో రకరకాల లైటింగ్ గాడ్జెట్స్​ అందుబాటులో ఉన్నాయి. రింగ్​ లైట్ చాలా పాపులర్​ గాడ్జెట్.​ దీనిని మీరు తక్కువ బడ్జెట్​లోనే కొనుక్కోవడానికి అవకాశం ఉంది.

పోర్టబుల్​ హార్డ్ డ్రైవ్​
వీడియోలు చాలా ఎక్కువ డేటాను ఆక్రమిస్తాయి. కనుక వాటిని సేవ్​, బ్యాక్​అప్​ చేసుకోవడానికి మంచి పోర్టబుల్​ హార్డ్​ డ్రైవ్స్​ తీసుకోవడం మంచిది.

హార్డ్​ డ్రైవ్​

ల్యాప్​టాప్​, కంప్యూటర్
వీడియోలు, ఫొటోలు ఎడిట్​ చేసుకోవడానికి మంచి మానిటర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ల్యాప్​టాప్​ కూడా బాగానే ఉంటుంది.

కంటెంట్​ క్రియేటర్స్​ కోసం బెస్ట్ మోనిటర్​, ల్యాప్​టాప్​

గ్రీన్​ స్క్రీన్​
మీరు క్రియేటివ్​ వీడియోలు తీయాలనుకుంటే.. గ్రీన్​ స్క్రీన్​ ఉపయోగించాల్సి ఉంటుంది. హై బడ్జెట్​ మూవీస్​లో కొన్ని సీన్స్​ తీసేందుకు బ్లూ స్క్రీన్​ను కూడా వాడుతుంటారు. వాస్తవానికి ఇవి తక్కువ బడ్జెట్​లోనే అందుబాటులో ఉన్నాయి.

బ్యాక్​గ్రౌండ్​ మార్చడం కోసం, విజువల్​ ఎఫెక్ట్స్​ కోసం గ్రీన్​ స్క్రీన్​

పవర్​ బ్యాంక్​
ముఖ్యంగా అవుట్​డోర్ షూటింగ్​లు చేసేటప్పుడు బ్యాటరీ బ్యాక్​అప్​ కోసం పవర్​ బ్యాంకులు అవసరమవుతాయి.

ఎడిటింగ్ సాఫ్ట్​వేర్స్ అండ్​ హార్డ్​వేర్స్​
మీరు విజువల్ వండర్స్ తీయాలనుకుంటే మాత్రం కచ్చితంగా పవర్​ఫుల్​ ఎడిటింగ్ సాఫ్ట్​వేర్స్​ వాడాల్సిందే. దీనితో పాటు పవర్​ఫుల్​ ర్యామ్​, గ్రాఫిక్స్​కార్డ్​ లాంటి హార్డ్​వేర్స్​ను కూడా అప్​డేట్ చేసుకోవాలి. అప్పుడే ఎడిటింగ్​ చాలా స్మూత్​గా చేసుకోవడానికి వీలవుతుంది.​

వీడియో ఎడిటింగ్​ కోసం మంచి సాఫ్ట్​వేర్​

ABOUT THE AUTHOR

...view details