తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఆర్డర్ ప్లీజ్ అంటున్న రోబో - restaurant management use robots for supply items

యంత్రం మరో రంగంలోకి ప్రవేశించింది. ఇనుప హృదయం.. సుతిమెత్తగా మాట్లాడుతోంది. ఏం కావాలి సర్ అంటూ తియ్యగా మాటలు కలుపుతుంది. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా.. హైదరాబాద్​లోని ఓ రెస్టారెంట్​లో..

రోబో సర్వింగ్ కిచెన్

By

Published : Feb 12, 2019, 5:18 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

రోబో సర్వింగ్ కిచెన్
మనిషి అవసరాల కోసం తయారు చేస్తున్న రోబోలు ప్రస్తుతం వినూత్న పద్ధతిలో వినియోగించుకుంటున్నాడు. రోబో ట్యూటర్, రోబో డ్రైవర్, రోబో న్యూస్ రీడర్​గా ఇప్పటివరకు మనం విన్నవి. కొత్తగా హోటల్​లో సర్వర్ అవతారం ఎత్తాయి. ఇది చైనానో, జపానో, అమెరికానో అనుకుంటున్నారా...? కాదు... మన హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో ఉన్న రోబో కిచెన్ హోటల్​లో.
ఈ మరయంత్రాలు మాట్లాడటమే కాదు... చెవులకు శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తూ వినియోగదారులు కోరిన ఆహారాన్ని వారి ముందు ఉంచుతున్నాయి. రొటీన్​కు భిన్నంగా స్మార్ట్​ ఆలోచనలతో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్​కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
దేశంలో మూడవది... రాష్ట్రంలో మొదటిది.
డిజిటల్ ఇండియా స్ఫూర్తిగా ముగ్గురు మిత్రులు కలిసి ఏర్పాటు చేసిన ఈ రోబో సర్వింగ్ కిచెన్ దేశంలో మూడోదని నిర్వాహకులు చెబుతున్నారు. రెస్టారెంట్ నిర్వహణలోను పూర్తి స్థాయి సాంకేతికతను వినియోగిస్తున్నారు. హోటల్​లో ఆహార పదార్థాలకు సంబంధించిన మెనూ కూడా ట్యాబ్ లో ఉండటం విశేషం.
Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details