ETV Bharat / science-and-technology
అబ్బ...అ!...ఓహ్... ఈ శబ్దాలకు 24 అర్థాలు - human emotions
మనం చేసే అబ్బ, అ, ఓహ్.... శబ్దాలతో 24 రకాల భావాలు వ్యక్తమవుతాయని పరిశోధకులు కనుగొన్నారు.
![అబ్బ...అ!...ఓహ్... ఈ శబ్దాలకు 24 అర్థాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2377914-558-5892298f-188c-47c0-a548-846474d0ab7d.jpg)
మీకు ఆనందం వచ్చినా..బాధ కలిగినా మీరు ఏం చేస్తారు. అబ్బ, అ!, ఓహ్, ఊప్స్ అని అంటారు. అలా అనే శబ్దాల వల్ల 24 రకాల ఎమోషన్లు (భావాలు) ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికా, భారత్, కెన్యా, సింగపూర్ల దేశాల్లో ఇందుకు సంబంధించిన పరిశోధనలు చేశారు.
2,000 శబ్దాలపై నిర్వహించిన ఈ సర్వేలో.. మాటల్లో చెప్పేదాని కన్నా ఎక్కువ అర్థాన్ని అబ్బ, అ, ఓహ్ శబ్దాలు వ్యక్తం చేస్తున్నాయని కనుగొన్నారు. ఇంతకు ముందు చేసిన సర్వేలో 13 వరకు భావాలు మాత్రమే కనుగొన్నారు.
వందల సంవత్సరాల నుంచి సైగలతోనే మనుషులు కొన్ని భావాల్ని వెల్లడిస్తున్నారు. సెకన్లలో చాలా భావాలను వ్యక్తం చేస్తున్నారు.
భావాల్ని ప్రదర్శించడంలోనూ మనుషులు విభిన్నతను చూపించారని పరిశోధకులు కనుగొన్నారు. ఇబ్బంది పడుతూ నవ్వడానికి, ఆనందంతో నవ్వడానికి ఉన్న తేడాయే దీనికి ఉదాహరణ.
2,000 రకాల మాటలు లేని శబ్దాలను 56 మంది పురుష,మహిళ కళాకారులతో చేయించారు. వివిధ సందర్భాల్లో ఎలా స్పందిస్తారో ప్రదర్శించమన్నారు. పరిశోధకులు వాటిని వీడియోలుగా చిత్రీకరించారు. ఈ 24 శబ్దాల్ని విభాగాలుగా పరిశోధకులు విడదీశారు. ఈ పరిశోధనలు మానవ సంబంధాలలో భావాలకుండే ప్రాధాన్యాన్ని తెలిపాయని చెప్పారు.