స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఖాతా ఉందా? వాట్సాప్‌లో కేవైసీ(నో యువర్ కస్టమర్) అప్డేట్ చేసుకోవాలని మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త! ఆ మెసేజ్లోని లింక్‌ను క్లిక్ చేస్తే మీ ఖాతాలోని డబ్బు మొత్తం మాయమవడం ఖాయం. అవును.. ఎస్బీఐ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని కొందరు చైనా హ్యాకర్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కేవైసీ అప్డేట్, ఉచిత గిఫ్ట్‌లంటూ నకిలీ లింక్‌లు పంపిస్తూ డబ్బులు కాజేస్తున్నారు. ఈ మేరకు దిల్లీకి చెందిన సైబర్‌పీస్ ఫౌండేషన్, ఆటోబాట్ ఇన్ఫోసెక్ అనే సంస్థలు ఇటీవల జరుగుతున్న ఈ సైబర్ నేరాలను బయటపెట్టి, ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి.
ఎస్బీఐ ఆన్లైన్ పేజీల్లాంటివే కానీ..
ఈ సంస్థలు చెప్పిన దాని ప్రకారం.. సైబర్ నేరగాళ్లు ముందు మన ఫోన్‌కు కేవైసీ వెరిఫికేషన్ అంటూ ఓ మెసేజ్ పంపిస్తారు. అందులోని లింక్ క్లిక్ చేయగానే అచ్చంగా ఎస్బీఐ ఆన్లైన్ పేజ్‌లాగే ఉండే పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు మన ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ పేరు, మొబైల్ నంబరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఇవ్వమని అడుగుతుంది. అవి నింపగానే మళ్లీ ఓటీపీ వచ్చిన పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ 'లాగిన్' బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ నొక్కగానే కేవైసీ పేజీ ఓపెన్ అయ్యి మన బ్యాంకు ఖాతా యూజర్‌నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పేజీలన్నీ అచ్చంగా ఎస్బీఐ ఆన్లైన్ పేజీల్లాగే కనిపిస్తాయి.
బహుమతుల పేరుతో టోకరా..