తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

భూమిని చేరిన చంద్రుని మట్టి నమూనాలు - చంద్రుని మట్టి, రాళ్ల నమూనాలు

చైనా ప్రయోగించిన వ్యోమనౌక 'చాంగే-5' చంద్రుడి పైనుంచి నమూనాలను భూమిపైకి తీసుకొచ్చింది. నమూనాలు ఉన్న క్యాప్సుల్.. బుధవారం అర్ధరాత్రి తర్వాత మంగోలియాలో దిగింది.

chinese-capsule-returns-to-earth-carrying-moon-rocks
భూమిని చేరిన చంద్రుని మట్టి నమూనాలు

By

Published : Dec 17, 2020, 4:47 AM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

జాబిల్లి నుంచి మట్టి, రాతి నమూనాలతో చైనా వ్యోమనౌక 'చాంగే -5' భూమిని సురక్షితంగా చేరింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంగోలియాలోని సిజివాంగ్ జిల్లాలో సంబంధిత క్యాప్సూల్ దిగింది.

ఇదీ చదవండి:జాబిల్లిపై జాతీయ జెండా పాతిన చైనా

ఈ నెల 1న జాబిల్లి ఉపరితలంపై కాలు మోపిన 'చాంగే -5' రెండు మీటర్ల లోతు వరకు తవ్వడం ద్వారా దాదాపు రెండు కిలోల నమూనాలను సేకరించింది. చంద్రుడి నుంచి మట్టి, రాతి నమూనాలను భూమికి తీసుకురావడం గత నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. చివరి సారిగా 1976లో అప్పటి సోవియట్ యూనియన్​కు చెందిన 'లూనా-24' చందమామ నుంచి నమూనాలను మోసుకొచ్చింది.

ఇదీ చదవండి:చంద్రుడిపై తవ్వకాలు​ మొదలు పెట్టిన చైనా

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details