తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మార్స్​పై కాలు మోపిన చైనా తొలి రోవర్​ - అంగారకునిపై చైనా అధ్యయనం

అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా చైనా పంపిన తియాన్​వెన్​-1 వ్యోమనౌకలోని ఆర్బిటర్​ నుంచి రోవర్​ విడిపోయి విజయవంతంగా అంగారకుడిపై కాలు మోపింది​. అరుణ గ్రహంపై భూగర్భ జలాలు, వాతావరణ పరిస్థితులు, ఇతర అంశాలపై అధ్యయనం చేయనుంది.

China's 1st Mars rover
చైనా రోవర్​

By

Published : May 22, 2021, 7:39 PM IST

Updated : May 22, 2021, 10:38 PM IST

అంగారకుడిపైకి చైనా పంపించిన తియాన్​వెన్​-1 వ్యోమనౌకలోని రోవర్ జురోంగ్..​ ఆర్బిటర్​ని వీడి కిందికి దిగింది. అరుణ గ్రహ దక్షిణార్ధగోళంలోని ఉటోపియా ప్లానీషియా అనే ప్రాంతంలో రోవర్‌ అడుగుపెట్టింది.అంగారక గ్రహంలో భూగర్భ జలాలు, ఇతర ప్రాచీన నాగరికతలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలపై అధ్యయనం చేస్తుంది. దాదాపు మూడు నెలల పాటు అరుణ గ్రహం ఉపరితల అంశాలను ఈ రోవర్​ పరిశీలిస్తుంది.

మార్స్​పై కాలు మోపిన చైనా తొలి రోవర్​

240 కేజీల బరువున్న ఈ రోవర్​.. ఆరు చక్రాలతో సీతాకోక చిలుక ఆకృతిని కలిగి ఉంది. ఏప్రిల్ 23న ప్రయోగించిన తియాన్​వెన్​-1 వ్యోమనౌక.. ఏడు నెలల పాటు ప్రయాణించి కక్ష్యలోకి చేరుకుంది. అరుణ గ్రహంపై అడుగుపెట్టిన చైనా తొలి రోవర్​ ఇదే.

భౌగోళిక అంశాల పరిశీలనే లక్ష్యంగా..

రెడ్​ ప్లానెట్​పై సమగ్ర పరిశీలన, ఉపరితలంపై శాస్త్రీయ దర్యాప్తు, భౌగోళిక నిర్మాణం, పర్యావరణం, వాతావరణ పరిస్థితులతో సహా.. నీటి జాడ వంటి తదితర అంశాలపై పరిశోధనలు చేస్తుందని స్థానిక మీడియా పేర్కొంది. రష్యా సహకారంతో చైనా 2011లోనే అంగారక యాత్ర చేపట్టినప్పటికీ ఆ ప్రయోగం విఫలమైంది.

ఇప్పటికే ఆరు వ్యోమనౌకలు అంగారకుని చుట్టూ తిరుగుతున్నాయి. ఇందులో మూడు అమెరికావి, రెండు ఐరోపావి, ఒకటి భారత్​కి చెందినది.

ఇదీ చదవండి:భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన కెనడా

:హగ్స్​, షేక్​హ్యాండ్స్​తో శ్వేతసౌధం​లో మళ్లీ పాతరోజులు

Last Updated : May 22, 2021, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details