తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

China Space Telescope : మరో భారీ టెలిస్కోప్‌ నిర్మించిన చైనా.. ఖగోళ శోధనలో డ్రాగన్​ ముందడుగు - largest chinese telescope

China Space Telescope : అంతరిక్ష రంగంలో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న చైనా.. ఖగోళాన్ని మరింత శోధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఖగోళాన్ని సర్వే చేసేందుకు ఉత్తరార్ధ గోళంలోనే అత్యంత శక్తిమంతమైన టెలిస్కోప్‌ను శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా ఖగోళంలో అప్పటికప్పుడు జరుగుతున్న ఘటనలను పరిశీలించి పరిశోధనలు చేసేందుకు సాధ్యపడుతుందని చైనా చెబుతోంది.

China Space Telescope
China Space Telescope

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 7:59 AM IST

Updated : Sep 6, 2023, 8:35 AM IST

China Space Telescope : అంతరిక్షం, ఖగోళాన్ని శోధించడంలో ప్రపంచంతో పోటీ పడుతున్న చైనా.. మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే సుదూర అంతరిక్షం నుంచి రేడియో సిగ్నల్స్‌ను స్వీకరించగల ప్రపంచంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌ను గుయిజౌ ప్రావిన్సులో డ్రాగన్‌ నిర్మించింది. ఇప్పుడు ఉత్తరార్ధ గోళంలోనే పెద్దదైన అత్యంత శక్తిమంతమైన టెలిస్కోప్‌ను అభివృద్ధి చేస్తోంది. అన్నీ సజావుగా సాగితే ఈ నెల మధ్యనాటికే ఇది అందుబాటులోకి వస్తుందని చైనా అధికారిక మీడియా జిన్హువా వెల్లడించింది. దీని ద్వారా ఖగోళంలో అప్పటికప్పుడు జరుగుతున్న ఘటనలను పరిశీలించి, పరిశోధనలు చేయడం సాధ్యపడుతుంది. దాదాపు 2.5 మీటర్ల వ్యాసంతో ఈ వైడ్‌ ఫీల్డ్‌ సర్వే టెలిస్కోప్‌ WFSTని రూపొందించింది.

ఖగోళ పరిశోధనకు దోహదం
China Telescope Biggest : చైనా శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయంతో పాటు చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అధీనంలోని పర్పుల్‌ మౌంటైన్‌ అబ్జర్వేటరీ ఈ భారీ టెలిస్కోప్‌ను రూపొందించాయి. WFST అందుబాటులోకి వస్తే పాలపుంత వెలుపల ఉన్న సుదూర నక్షత్రవీధులతోపాటు వివిధ గెలాక్సీ సమూహాలపై పరిశోధనలు సాగించేందుకు వీలుపడుతుంది. అంతేకాకుండా ఖగోళ సంకేతాలను గుర్తించేందుకు ఈ టెలిస్కోప్‌ని ఉపయోగించుకోవచ్చు. భూ ఉత్తరార్ధ గోళంలోనే ఇది ఒక శక్తిమంతమైన టెలిస్కోప్‌గా అవతరిస్తుందని ప్రాజెక్టు చీఫ్‌ డిజైనర్‌ కాంగ్‌ జు తెలిపారు. ఈ టెలిస్కోప్‌ అందుబాటులోకి వస్తే చైనా భూభాగానికి సమీపంలో ఉన్న ఖగోళ వస్తువులు, సిగ్నల్స్‌పై పూర్తి స్థాయిలో దృష్టిసారించేందుకు అవకాశం ఉంటుంది.

2019లో నిర్మాణం ప్రారంభం
Largest Chinese Telescope : జులై 2019లోనే లెంఘు పట్టణంలో ఈ WFST టెలిస్కోప్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ పట్టణం 4000 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అంతేకాకుండా ఈ పట్టణం అరుణ గ్రహం ఉపరితలాన్ని పోలి ఉండటం వల్ల దీనిని చైనా మార్స్‌ క్యాంప్‌ అని పిలుస్తారు. లెంఘు పట్టణం పీఠభూమి ప్రాంతంలో ఉండటం వల్ల స్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. రాత్రి పూట ఆకాశం నిర్మలంగా ఉండి పరిశోధనలకు వీలుగా ఉంటుంది. అందుకే టెలిస్కోప్‌ను అక్కడ చైనీయులు నిర్మించారు.

టిబెట్‌ పీఠభూమిలో చైనా తిష్ట.. సూర్యుడిపై పరిశోధనల కోసం భారీ టెలిస్కోపు నిర్మాణం

James Webb Space Telescope : విశ్వ రహస్యం తెలిసిందా..? కృష్ణ నక్షత్రాల ఉనికి కనిపెట్టిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌

Last Updated : Sep 6, 2023, 8:35 AM IST

ABOUT THE AUTHOR

...view details