ChatGPT Latest Features : చాట్ జీపీటీ ఇప్పుడు మాట్లాడుతుంది, వింటుంది, చూస్తుంది కూడా. అందుకు ఉపయోగపడే ఫీచర్లను వినియోగదారుల కోసం తీసుకువచ్చింది ఓపెన్ ఏఐ సంస్థ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ చాట్‌జీపీటీలో వాయిస్, ఫొటో క్యాపబిలిటీ ఫీచర్లను ప్రవేశపెట్టింది. దీంతో చాట్ జీపీటీ సాధనంలో సంచలన మార్పులు రానున్నాయి.
వాయిస్ అసిస్టెంట్ ఫీచర్..
వాయిస్ అసిస్టెంట్ ఫీచర్సాయంతో వినియోగదారులుచాట్జీపీటీతో నేరుగా సంభాషణలు జరపవచ్చు. ఇదే ఈ ఫీచర్ ప్రధాన లక్షణం. చాట్‌జీపీటీతో మాట్లాడి మీకు కావలసిన సమాచారాన్ని ఏఐ నుంచి కోరవచ్చు. మీరిచ్చిన సందేశాలను అది స్వీకరించి.. అనంతరం అర్థం చేసుకుని తిరిగి మీకు సమాధానాన్ని ఇస్తుంది. (ChatGPT Voice And Image Capabilities Features )
వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోండిలా!
- మీ మొబైల్ చాట్ జీపీటీ యాప్‌లోకి వెళ్లండి.
- యాప్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
- అందులో న్యూ ఫీచర్స్‌ను సెలెక్ట్ చేయండి
- అనంతరం కాన్వర్జేషన్‌ను ఎంపిక చేసుకోండి.
ఈ ఫీచర్లో మొత్తం ఐదు రకాల వాయిస్‌లు నిక్షిప్తమై ఉన్నాయి. మనుషుల వాయిస్ మాదిరిగానే నాచురల్‌గా ఉండేందుకు ప్రొఫెషనల్ వాయిస్ యాక్ట్ర్ను ఇందుకోసం ఉపయోగించుకుంది ఓపెన్ సంస్థ. ఈ వాయిస్‌ల కోసం హెడ్‌ఫోన్ సింబల్‌పై నొక్కి.. రైట్ కార్నర్లో ఉన్న వివిధ రకాల వాయిస్‌లు ఎంచుకోవచ్చు. వీటితోపాటు ఓపెన్ సోర్స్ స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్, మాటలను అక్షరం రూపంలోకి మార్చడం సహా, విస్పర్ లాంటి అదనపు ఫీచర్లను కూడా ఓపెన్ ఏఐ తీసుకువచ్చింది.