ఐఫోన్ల కెమెరా సామర్థ్యమే వేరు. వీటి ఫొటోల స్పష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రో సిరీస్ ఫోన్లయితే మరింత క్వాలిటీతోనూ ఫొటోలు తీస్తాయి. అంతా వీటి ప్రత్యేకమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లు గొప్పతనమే. స్టాండర్డ్ రకాలతో ప్రో రకం ఐఫోన్లతో తీసే ఫొటోలు ఇంకాస్త స్పష్టంగా ఉంటాయి. అందుకే వీటిపై అందరికీ అంత ఆసక్తి. మీరూ ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 14 ప్రో రకాలను వాడుతున్నట్టయితే సెటింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకొని చూడండి. ఆశ్చర్యపోవటం ఖాయం.
యాపిల్ ప్రోరా..:
ఐఫోన్ 12 ప్రో, 12 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఇది ఆర్‌ఏడబ్ల్యూ ఫార్మాట్‌లో దృశ్యాలను గ్రహిస్తుంది. వీటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఇష్టమైనట్టుగా కలర్‌ను కరెక్ట్ చేసుకోవచ్చు.
- సెటింగ్స్ ద్వారా కెమెరాలోకి వెళ్లి ఫార్మాట్స్ ఆప్షన్‌లో యాపిల్ ప్రోరాను ఎనేబుల్ చేసుకోవాలి.
కెమెరా గ్రిడ్
ఇది ప్రో రకాల్లోనే కాదు ఇతర ఐఫోన్లలోనూ అందుబాటులో ఉంది. కెమెరా గ్రిడ్‌ను ఎనేబుల్ చేసుకుంటే బాగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. నైపుణ్యం గల ఫొటోగ్రాఫర్లు తీసినట్టుగా మరింత స్పష్టంగా ఫొటోలు తీసుకోవచ్చు.
- సెటింగ్స్ నుంచి కెమెరాలోకి వెళ్లి గ్రిడ్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.