Chandrayaan 3 Soft Landing Again : జాబిల్లి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు వెళ్లిన చంద్రయాన్-3లో భాగమైన విక్రమ్ ల్యాండర్‌ను మరోసారి విజయవంతంగా స్టాఫ్ ల్యాండింగ్ చేసింది ఇస్రో. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఇస్రో.. తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది.
దాదాపు 40 సెం.మీ పైకి లేచి..
Chandrayaan 3 Second Soft Landing : చంద్రయాన్-3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్‌కు అప్పగించిన లక్ష్యాలను అధిగమించిందని ఇస్రో వెల్లడించింది. శాస్త్రవేత్తల ఆదేశానుసారం ఇంజిన్లను మండించినట్లు తెలిపింది. దాదాపు 40 సెం.మీ వరకు ల్యాండర్ పైకి లేచిందని, 30-40 సెం.మీ పక్కన సురక్షితంగా ల్యాండ్ అయినట్లు తెలిపింది. మానవ మిషన్లు సురక్షితంగా తిరిగిరావడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.
అన్ని వ్యవస్థలు సక్రమంగానే..
Chandrayaan 3 Lander Update : ల్యాండర్‌లోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని ఇస్రో వెల్లడించింది. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాలకు ఇది నాందిగా తెలిపింది. హాప్ ఎక్స్‌పరిమెంట్ విజయవంతమైనట్లు తెలిపిన ఇస్రో.. చేస్ట్, ఐఎల్ఎస్ఏ పరికరాలు ఫోల్డ్ అయ్యాయని చెప్పింది. పరీక్ష పూర్తి అయిన తర్వాత అవి మళ్లీ యథావిథిగా పనిచేస్తున్నట్లు వివరించింది.
స్లీప్ మోడ్‌లోకి 'ప్రజ్ఞాన్' రోవర్..
Chandrayaan 3 Sleep Mode : చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేసుకొని విశ్రాంతికి సిద్ధమయ్యాయని ఇస్రో ఇటీవలే ప్రకటించింది. తొలుత ప్రజ్ఞాన్ రోవర్‌ను స్లీప్ మోడ్‌లోకి పంపినట్లు ఇస్రో.. శనివారం రాత్రి వెల్లడించింది. దానికి అమర్చిన పేలోడ్ పనులను నిలిపేసినట్లు ఇస్రో పేర్కొంది.