చంద్రయాన్-2 ప్రయోగంలో (chandrayaan 2) భాగంగా ఇస్రో పంపించిన స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు పరిభ్రమించిందని అధికారులు తెలిపారు. స్పేస్‌క్రాఫ్ట్‌లోని ఇమేజింగ్, సైంటిఫిక్ పరికరాలు అద్భుతమైన సమాచారాన్ని భూమి మీదకు తిరిగి పంపిస్తున్నాయని వెల్లడించారు.
చంద్రయాన్-2 పరికరం రెండేళ్ల పనికాలం (chandrayaan 2 launch date) పూర్తి చేసుకున్న సందర్భంగా ఇస్రో రెండు రోజుల లూనార్ సైన్స్ (isro lunar science workshop) వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. సోమవారం జరిగిన ప్రారంభోపన్యాసంలో ఇస్రో ఛైర్మన్ కే శివన్ (isro chairman) ఈమేరకు వివరాలు వెల్లడించారు. స్పేస్‌క్రాఫ్ట్ మీద ఉన్న ఎనిమిది పేలోడ్లు.. వంద కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రుడిని పరిశీలిస్తున్నాయని తెలిపారు.
"ఈ రోజు వరకు చంద్రయాన్-2.. చంద్రుడి చుట్టూ 9 వేలకు పైగా పరిభ్రమించింది. మాకు అందిన సమాచారాన్ని విద్యా సంస్థలకు అందుబాటులో ఉంచుతున్నాం. అందరి భాగస్వామ్యంతో మరింత సమాచారాన్ని వెలికి తీయాలని భావిస్తున్నాం. ఇప్పటివరకు విశ్లేషించిన ఫలితాలు.. చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ శాటిలైట్ అద్భుతమైన సమాచారాన్ని పంపిస్తోంది."