తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

చంద్రునిపై సోడియం నిల్వలు గుర్తించిన ఇస్రో.. చంద్రయాన్-2 ఘనత - చంద్రయాన్1

చంద్రుడిపై సోడియంను చంద్రయాన్​ 2 గుర్తించింది. సోడియం నిల్వలను మ్యాప్ చేసినట్లు ఇస్రో తెలిపింది. గతంలో చంద్రయాన్​ 1 సైతం ఈ విషయాన్ని గుర్తించగా ఇప్పటి ప్రయోగంలో చంద్రుడిపై సోడియం ఉన్నట్లు నిర్దరణ అయ్యింది.

chandrayaan2
sodium on moon

By

Published : Oct 8, 2022, 1:48 PM IST

చంద్రుడిపై భారీగా సోడియం ఉన్నట్లు చంద్రయాన్-2 తొలిసారి గుర్తించింది. చంద్రయాన్-2లోని లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్టోమీటర్ ద్వారా ఈ సోడియం నిల్వలను మ్యాపింగ్ చేసినట్లు ఇస్రో తెలిపింది. గతంలో చంద్రయాన్-1లోని ఫ్లూరోసెన్స్ స్పెక్ట్రోమీటర్ కూడా చంద్రుడిపై సోడియం ఉన్నట్లు గుర్తించింది. హైసెన్సిటివిటీ, సామర్థ్యం కలిగిన క్లాస్‌ను బెంగళూరులోని U.R.రావు శాటిలైట్ సెంటర్‌లో తయారు చేసినట్లు ఇస్రో తెలిపింది.

ఇది సోడియం లైన్స్‌ను వెంటనే గుర్తిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్‌లో ప్రచురితమైన కథనంలో ఈ మేరకు ఇస్రో పేర్కొంది. చంద్రుడి ఉపరితలం నుంచి వేల కిలోమీటర్ల వరకు సోడియం జాడలు కనిపించినట్లు ఇస్రో తెలిపింది. చంద్రుడి ఉపరితలం, ఎక్సోస్ఫేర్ సంబంధాన్ని అధ్యయనం చేయడానికి తాజా పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details