YS Viveka murder: మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో రేపు కీలక విచారణ జరగనుంది. వివేకా హత్య జరిగినప్పటి నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డిని సీబీఐ మరోసారి ప్రశ్నించనుంది. కడపలో సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అయితే అవినాష్ రెడ్డికి నోటీసు జారీ చేసిన నేటి విచారణకు హాజరు కాలేనని సీబీఐ కి లేఖ రాశారు. సోమవారం పులివెందులలో జరిగే కార్యక్రమాల్లో అవినాష్ రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపారు.
2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగినప్పటి నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వై.ఎస్.అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డిని సీబీఐ మరోమారు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. సోమవారం ఉదయం హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే తాను హాజరు కాలేనని అవినాష్ రెడ్డి చెప్పినప్పటికీ... తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని సీబీఐ అధికారులు శనివారం రాత్రి స్పష్టం చేశారు. అయితే పులివెందుల నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి ఆదివారం సాయంత్రం సీబీఐకి లేఖ రాశారు. ఆయన సోమవారం ఉదయం వేంపల్లి లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో ఉదయం 8 గంటలకు పాల్గొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వై.ఎస్. భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు సోమవారం కడపలో విచారించనున్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.