ETV Bharat / science-and-technology
V2X Technology in Cars : కార్లు మాట్లాడుకుంటాయి.. ఎలా తెలుసా..? - కార్లలో వీ2ఎక్స్ టెక్నాలజీ
V2X Technology in Cars : రోడ్డుపై వాహనాలు మాట్లాడుకుంటాయి. ప్రమాదాలు జరగకుండా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తాయి. స్పీడ్ బ్రేకర్లు, రాంగ్ రూట్‌లో వస్తున్న వాహనాలు, అంబులెన్స్‌లు, రోడ్డుపై నడుస్తున్న మనుషులు..... ఇలా సమస్త సమాచారం డ్రైవర్ కళ్లముందుంచుతాయి. ఐఐటీ హైదరాబాద్, సుజుకీతో కలిసి గత రెండేళ్లుగా.. వీ2ఎక్స్(V2X) పేరుతో వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వస్తున్న ఈ సాంకేతికతపై మరింత సమాచారం తెలుసుకుందాం....
V2X Technology in Cars : ఏటికేటా సరికొత్త రూపు సంతరించుకుంటున్న ఆటోమొబైల్ రంగం... మరికొన్నేళ్లల్లో అత్యా ధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. విద్యుత్‌తోనే పరుగులు తీసే... డ్రైవర్ రహిత వాహనాల అభివృద్ధికి తయారీ సంస్థలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందుకోసం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులు చేపడుతున్నాయి. వాటిలో ఒకటిగా ఉన్న దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ... సుజుకీ హెడ్ క్వార్టర్స్‌లో పరిశోధక ఇంజనీర్‌గా అవకాశం దక్కించుకుంది... ప్రత్యూష. ఆ సంస్థ చేపట్టిన వీ2ఎక్స్ (V2X) సాంకేతికత విశేషాలు, తాను పరిశోధిస్తున్న సాంకేతికతల విశేషాలేంటో... ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...
- ఇదీ చదవండి :కోర్టులో లొంగిపోయిన బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్